• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మొన్న మోడీ రాఖీలు... నిన్న మోడీ వెడ్డింగ్ కార్డులు: ఇదే జాబితాలోకి కొత్త ఐటెం

|

ప్రధాని మోడీ... ప్రపంచ దేశ నాయకులతో సైతం సలాం కొట్టించుకుంటున్న ఏకైక ప్రధాని. మోడీ ఎక్కడికి వెళ్లిన ఆదేశ ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి మనదేశంలో అయితే చెప్పక్కర్లేదు. ఇక గుజరాత్‌లో అయితే మోడీ ఫోటోతో ఉన్న వస్తువులనే అక్కడి ప్రజలు వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. మొన్నటికి మొన్న వెడ్డింగ్ కార్డులపై మోడీ ఫోటోలు దర్శనమిచ్చాయి. మోడీ రాఖీలు వచ్చాయి...తాజాగా మరో ఐటెం మోడీ జాబితాలో చేరింది. ఇంతకీ ఆ ఐటెం ఏంటి..?

మోడీ ఫోటోతో చీరెలు

మోడీ ఫోటోతో చీరెలు

మోడీ ఫోటోతో వెడ్డింగ్ కార్డులు, రాఖీలు, టీషర్టులు, తాజాగా మరో ఐటెం ఈ జాబితాలో చేరింది. అదే మహిళలు ఎంతో ఇష్టంగా కట్టుకునే చీరలు కూడా మోడీ ఫోటోతోనే వస్తున్నాయి. మహిళలు ఈ చీరెలు కొనేందుకు షాపుల ముందర క్యూకడుతున్నారు. ఇంతకీ మోడీ ఫోటోతో ఉన్న చీరెలు ఎక్కడ అమ్ముతున్నారో తెలుసా... ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే. లోక్‌‌సభ ఎన్నికలకు ముందు సూరత్‌లో ఈ చీరెలు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న మోడీ చీరెలు

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న మోడీ చీరెలు

ఇక మోడీ ఫోటోతో చీరలు అమ్ముతున్నారని తెలుసుకున్న మహిళలు ఆ చీరెలు విక్రయిస్తున్న దుకాణానికి క్యూ కట్టారు. వివిధ కలర్స్‌లో ఇక్కడ చీరెలు లభిస్తున్నాయి. దొరికింది దొరికినట్లు కొనేస్తున్నారు మహిళలు. చీరెలపై మోడీ ఫోటోను డిజిటల్ ప్రింటింగ్ చేశామని చెబుతున్నాడు దుకాణాదారుడు. ఈ తరహా మోడల్ ఈ మధ్యనే తీసుకొచ్చినట్లు యజమాని చెప్పాడు. మహిళలు ఈ చీరెలను ఎంతగానో ఇష్టపడుతున్నారని వెల్లడించాడు. ప్రస్తుతం మోడీ ఫోటోలు కలిగిన నాలుగు రకాల చీరెలను అమ్మకానికి పెట్టినట్లు యజమాని చెప్పాడు. ఇక ఇతర రాజకీయ నాయకుల ఫోటోలతో కూడా చీరెలను త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు.

ఎన్నికల ముందు మోడీ చీరెలకు భలే గిరాకీ

ఎన్నికల ముందు మోడీ చీరెలకు భలే గిరాకీ

ఈ మధ్యనే హైదరాబాదులో ఓ మోడీ మద్దతుదారుడు తన వివాహ ఆహ్వాన పత్రికలో మళ్లీ మోడీనే ప్రధాని కావాలంటూ అందులో రాసి ప్రచారం చేశాడు. ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక గతేడాది దీపావళి సందర్భంగా మోడీ ఫోటోతో కూడిన బంగారు బిస్కెట్లు వెండి వస్తువులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అలానే రాఖీలు కూడా మంచి మార్కెట్ చేశాయి. మొత్తానికి మోడీ మీద ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదనిపిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After wedding cards and t shirts with imprints of Prime Minister Narendra modi on them, looks like it is the season of sarees now.You can now own a saree with the face of PM Modi printed on it. The sarees are quite popular in gujarat the native state of PM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more