వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టుల ప్రాణాలు కాపాడిన ప్రధాని మోడీ!

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించ‌డం వల్ల ప‌లువురు మీడియా ప్ర‌తినిధులు ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని గుజ‌రాత్ ఉప ముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్ స్వయంగా వెల్ల‌డించారు.

మంగ‌ళ‌వారం గుజ‌రాత్ పర్య‌ట‌న‌లో భాగంగా మోడీ ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. జామ్‌న‌గ‌ర్‌లో మీట నొక్కి డ్యామ్ నుంచి నీటిని విడుద‌ల చేసిన త‌ర్వాత అక్క‌డి ప్ర‌కృతిని చూస్తూ మోడీ నిల్చున్నారు.

Modi saves Journalists, says Nitin Patel

అయితే అప్ప‌టికే డ్యామ్‌కి కాస్త దూరంలో కింద నిల‌బ‌డి ఫొటోలు తీస్తున్న జ‌ర్న‌లిస్ట్‌లు వేగంగా వ‌స్తున్న నీటి ప్ర‌వాహాన్ని గ‌మ‌నించ‌లేదు. ఆ ఫొటోగ్రాఫ‌ర్ల‌ను గ‌మ‌నించిన మోడీ చ‌ప్ప‌ట్లు కొడుతూ, చేతులు ఊపుతూ వారిని అప్ర‌మ‌త్తం చేశారు.

దీంతో స‌మ‌యానికి వాళ్లు అక్క‌డి నుంచి త‌ప్పుకున్నారు. ప్ర‌ధాని స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌ని నితిన్ ప‌టేల్ తెలిపారు. గతంలో ప్రధాని మోడీ.. ఓ రిపోర్టర్ కిందపడిపోతుండగా పట్టుకుని పైకి లేపిన విషయం తెలిసిందే.

English summary
Gujarat Deputy CM Nitin Patel on Tuesday said that PM Narendra Modi saved Journalists, who are attended his programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X