వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ మోడీ... అర్ధరాత్రి సీఎం ఫోన్ కాల్- అద్భుత స్పందనతో అవాక్కైన వైనం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ లాక్ డౌన్ విధించాక మన రాజకీయ నేతల్లో వచ్చిన మార్పును చూస్తూనే ఉన్నాం కదా. రాజకీయాలకు అతీతంగా ఇప్పటికే ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు వ్యవహరిస్తున్న వీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. సరిగ్గా ఇదే కోవలో తాజాగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చేసిన ఓ విజ్ఞప్తికి ప్రధాని మోడీ స్పందించిన తీరు దేశ రాజకీయాల్లో నవశకానికి నిదర్శనంలా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే...

మోడీకి నవీన్ పట్నాయక్ అర్ధరాత్రి కాల్...

మోడీకి నవీన్ పట్నాయక్ అర్ధరాత్రి కాల్...

నిన్న అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలవుతోంది. ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాల్ చేశారు. నవీన్ నుంచి అర్ధరాత్రి కాల్ ఊహించని ప్రధాని ఏం జరిగిందో తెలుసుకుందామని ప్రయత్నించారు. లైన్ లోకి వచ్చిన నవీన్...
ఈ సమయంలో ఫోన్ చేస్తున్నందుకు క్షమించండి,
మేము ఆర్డర్ చేసిన కరోనా కిట్‌లు ముంబై-నాసిక్ మార్గంలో చిక్కుకుపోయాయి, అవి ఇప్పుడల్లా మాకు చేరే అవకాశం లేదు, మాకు మీరే దిక్కు, అవి త్వరగా మాకు చేరేలా సాయం చేయండి.." అంటూ అభ్యర్ధించారు.

కూల్ గా స్పందించిన మోడీ...

కూల్ గా స్పందించిన మోడీ...


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పై జరుగుతున్న పోరు కారణంగా నిత్యం బిజీగా ఉంటున్న ప్రధాని మోడీ... నవీన్ కాల్ కు స్పందిస్తూ... మీ ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. నవీన్ ఒకింత అసహనంగానే సార్.. నేను బాగానే ఉన్నాను. ఈ సమయంలో మీకు ఫోన్ చేయడానికి కారణం ముంబై నుంచి కరోనా కిట్లను త్వరగా మా రాష్ట్రానికి పంపమని కోరేందుకే అన్నారు. అందుకు మోడీ.. మీకు కిట్లు లోడ్ అవుతున్నాయి. మీరు నిద్ర లేచేటప్పుటికి అవి మీముందు ఉంటాయని బదులిచ్చారు. దీంతో నవీన్ ఉబ్బితబ్బిబయ్యారు.

స్పెషల్ ఆపరేషన్- తెరుచుకున్న భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్...

స్పెషల్ ఆపరేషన్- తెరుచుకున్న భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్...


ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు హామీ ఇచ్చిన మేరకు మోడీ కిట్లను పంపారు. అయితే అవి ముంబై-నాసిక్ మార్గంలో చిక్కుకున్నవి కాదు. సరిగ్గా ఆయన కోరిన పరిమాణంలోనే ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక కార్గో విమానంలో భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు. అటు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా భువనేశ్వర్ ఎయిర్ పోర్టు చాలా రోజులుగా మూసే ఉంది. కానీ ప్రధాని కార్యాలయం అదేశాలతో ఢిల్లీ నుంచి కార్గో విమానం ద్వారా కరోనా కిట్లు పంపుతున్నట్లు ప్రధాని కార్యాలయం ఇచ్చిన సమాచారంతో భువనేశ్వర్ ఎయిర్ పోర్టును అర్ధరాత్రి అత్యవసరంగా తెరిచారు. విమానాశ్రయంలో ఎక్కడ లేని హడావుడి ప్రారంభమైంది..
నెల రోజులుగా హాయిగా నిద్రపోతున్న అక్కడున్న స్టాఫ్ అర్థరాత్రి ఏమిటి ఈ హడావుడి అనుకున్నారు. నవీన్‌పట్నాయక్ ప్రధాని మోదీకి ఫోన్ చేసింది 12.15 కి అయితే, కరోనా కిట్లతో కార్గో విమానం భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో 3.15 కి ల్యాండ్ అయింది.

English summary
in a rearest of rare incident, prime minister modi sent covid 19 testing kits from delhi to bhuvaneswar on emergency basis after receiving a request from odisha cm naveen patnaik last night. after receiving the kits patnaik thanked pm modi for his immediate response.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X