వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్ బెంగాల్: ఎక్కువ సీట్ల కోసం ఎక్కువ సభలు...బెంగాల్‌లో బీజేపీ ప్లాన్ ఇదే..!

|
Google Oneindia TeluguNews

పశ్చిమబెంగాల్‌లో ఈసారి బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లపై కన్నేసింది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పార్టీలు జతకట్టడంతో అక్కడి పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారడంతో బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఇందులో భాగంగానే వీలైనన్ని ఎక్కువ సీట్లను బెంగాల్‌లో రాబట్టాలని భావిస్తున్న మోడీ-షా ద్వయం అదే స్థాయిలో ఎక్కువ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది.

బెంగాల్‌పై కన్నేసిన బీజేపీ

బెంగాల్‌పై కన్నేసిన బీజేపీ

2014 బీజేపీ విక్టరీ వన్‌సైడెడ్‌గా అయ్యింది. కానీ ఈసారి విజయం కాషాయం పార్టీకి అంత ఈజీగా లేదు. ఈ విషయం కమలం పార్టీ పెద్దలకు కూడా తెలుసు. అంతేకాదు ప్రధాన హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. ఇక లుక్ ఈస్టీ పాలసీ ప్రిన్సిపల్‌ను అమలు చేసేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఒడిషా, వెస్ట్‌బెంగాల్‌పై కన్నేసింది. ముఖ్యంగా బెంగాల్‌లో 42 పార్లమెంటరీ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంపై సీరియస్‌గా దృష్టి సారిస్తోంది కమలం పార్టీ. ఇందులో భాగంగానే అత్యధిక ర్యాలీలు మోడీ-షా ద్వయం ఇక్కడ నిర్వహించింది. మార్చి 26 నుంచి మే 1 వరకు అంటే ఐదు విడతల ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ 80 ర్యాలీల్లో పాల్గొనగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా 14 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో మోడీ 13 ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించగా అమిత్ షా 12 ర్యాలీల్లో ప్రసంగించారు.

రైతు రుణమాఫికి లేని డబ్బు పారీశ్రామికవేత్తలకు ఎక్కడిది ? ప్రియాంక గాంధి రైతు రుణమాఫికి లేని డబ్బు పారీశ్రామికవేత్తలకు ఎక్కడిది ? ప్రియాంక గాంధి

 మమతా బెనర్జీ లక్ష్యంగానే మోడీ షా విమర్శలు

మమతా బెనర్జీ లక్ష్యంగానే మోడీ షా విమర్శలు

గుజరాత్‌లో కంటే బెంగాల్‌లోనే మోడీ అమిత్ షాలు ఎక్కువ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. మోడీ వెస్ట్ బెంగాల్‌లో పాల్గొన్న 10 సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక అన్ని సభలలో మమతా బెనర్జీ లక్ష్యంగానే ఇద్దరు నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తన స్థానాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా... లెఫ్ట్ పార్టీలు క్రమంగా పట్టుకోల్పోయాయి. ఇక ప్రధాన యుద్ధం మాత్రం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్యే ఉన్నట్లుగా పిక్చర్ అర్థమవుతోంది. 2014లో తృణమూల్ కాంగ్రెస్ 34 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ నాలుగు, లెఫ్ట్ పార్టీలు బీజేపీలు చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి.

 కోల్‌కతాలో మెగా రోడ్‌షోకు బీజేపీ ప్లాన్

కోల్‌కతాలో మెగా రోడ్‌షోకు బీజేపీ ప్లాన్


ఇక మే 19న చివరి దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోల్‌కతాలో భారీ రోడ్‌షోలు నిర్వహించాలని మోడీ షా ద్వయం భావిస్తోంది. బెంగాల్‌ను పక్కనపెడితే బీహార్, జార్ఖండ్,ఒడిషా రాష్ట్రాల్లో కూడా విస్తృత పర్యటనలు చేశారు. ఇక నాలుగు తూర్పు భారత రాష్ట్రాల్లో 117 పార్లమెంటరీ స్థానాలుండగా... 2014లో ఎన్డీఏ కూటమి 46 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించింది. అయితే బీజేపీ అత్యధిక సీట్లను బీహార్‌లో గెలుపొందింది. ఇప్పుడు జేడీయూతో కలిసి పొత్తుతో పోటీ చేస్తోంది.ఇక 63 స్థానాలున్న వెస్ట్ బెంగాల్, ఒడిషాలలో 2014లో కేవలం మూడు స్థానాలు మాత్రమే బీజేపీ గెలిచింది.

English summary
BJP is eyeing on West Bengal.Therefore the saffron party is planning number of rallies in this eastern state. Hoping to win majority seats, MOdi and Shah are planning a huge road shows in Kolkata just before the final phase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X