వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 2.0 టీమ్ .. క్యాబినెట్ బెర్త్ లెక్కలివే

|
Google Oneindia TeluguNews

Recommended Video

మోడీ 2.0 టీమ్... కేంద్ర మంత్రులు వీరే!! | Modi | Amithshah | Nirmalasitharaman | cabinet

న్యూఢిల్లీ : నరేంద్రుడి టీం కొలువుదీరింది. పాత, కొత్తల కలయికతో ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం 58 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 25 మంది కేంద్రమంత్రులు ఉండగా .. 9 మంది కేంద్ర స్వతంత్ర హోదా, మరో 24 మంది కేంద్ర సహాయ మంత్రి పదవీ కేటాయించారు. దీంతోపాటు కొన్ని ఆసక్తికర ఘటనలను ఓసారి పరిశీలిద్దాం.

వీరే కేంద్రమంత్రులు ...

న‌రేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ, స‌దానంద గౌడ‌, నిర్మలా సీతారామన్, రాం విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్ , రవిశంకర్ ప్రసాద్, హరిసిమ్రత్ కౌర్ బాదల్, థావర్ చంద్ గెహ్లాట్, డాక్టర్ సుబ్రమణ్య జయశంకర్, డాక్టర్ రమేష్ పోక్రియాల్ , అర్జున్ ముండా, స్మృతి ఇరానీ, డాక్టర్ హర్షవర్థన్ , ప్రకాష్ జవదేకర్ , పీయూష్ గోయల్ , ధర్మేంద్ర ప్రదాన్ , ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి, మహేంద్రనాథ్ పాండే , అరవింద్ గణపత్ సావంత్, గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్రమంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. వీరికి పోర్టుపోలియో కేటాయించాల్సి ఉంది.

9 మంది కేంద్ర స్వతంత్ర హోదా ..

కేంద్ర స్వతంత్ర హోదా మంత్రులుగా 9 మంది ప్రమాణం చేశారు. సంతోష్ గంగ్వార్ , రావ్ ఇంద్రజిత్ సింగ్, శ్రీపథ్ నాయక్, కెప్టెన్ జితేంద్ర సింగ్, కిరణ్ రిజుజు, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి , మన్సూక్ లక్ష్మణ్ భాయ్ ఈశ్వర్ కే శపత్ లేత హు అంటు ప్రమాణం చేశారు.

కేంద్ర సహాయ మంత్రులు 24 మంది

కేంద్ర సహాయ మంత్రులు 24 మంది

అశ్వినీ కుమార్ చౌబే, అర్జున్ రామ్ మేఘవాల్ , జనరల్ వి.కె సింగ్, కృష్ణ పాల్ గుజ్జర్ , దాన్వే దాదారావ్ పటేల్ , కిషన్ రెడ్డి , పురుషోత్తం రూపాల , రామ్‌దాస్ అథవాలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో, డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యన్, ధోత్రె సంజయ్ షమ్రావ్, అనురాగ్ సింగ్ ఠాకూర్ , అంగడి సురేష్ చన్నబసప్ప, నిత్యానంద్ రాయ్, రత్తన్ లాల్ కటారియా, వీ మురళీధరన్ , రేణుకా సింగ్ సరుట , సోమ్ ప్రకాష్ , రామేశ్వర్ టేలి , ప్రతాప్ చంద్ర సారంగి, కైలాష్ చౌధరి, శ్రీమతి దేబాశ్రీ చౌధురి, ఫగ్గన్ సింగ్ కులస్తే

ఈశ్వర్ కీ శపత్ లేత హు

ఈశ్వర్ కీ శపత్ లేత హు

మోడీతో ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రారంభమైంది. ఈశ్వర్ కీ శపత్ లేత హు అంటూ మోదీ ప్రమాణం చేశారు. తర్వాత సీనియారిటీ ప్రకారం రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ, సదానందగౌడ్ వచ్చారు. వీరంతా హిందీలో తమ ప్రతీన చేశారు. ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్ కూడా హిందీలో ప్రమాణ క్రతువు ముగించారు.

ముక్తార్ కూడా ..

ముక్తార్ కూడా ..

నిర్మలా సీతారామన్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. శిరోమణి అకాళిదల్ పార్టీకి చెందిన హరిశిమ్రత్ కౌర్, రావు ఇంద్రజిత్ సింగ్, హర్ దీప్ సింగ్ పూరి, బాబుల్ సుప్రియో, మురళీధరన్ కూడా ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. హర్ దీప్ సింగ్ రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రమాణం చేయడం ఆశ్యర్యానికి గురిచేసింది. కానీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఈశ్వర్ కీ శపత్ లేత హు అంటు ప్రమాణం చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

English summary
The government was formed with an old and new combination. A total of 58 ministers were sworn in. Of these, 25 are Union Ministers, 9 are Central Standing Committees and 24 are Union Minister of State. Let's look at some interesting events as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X