వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న మోడీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రపతిని కలవనున్నారు. సాయంత్రం రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమై రాజీనామా లేఖ అందజేసే అవకాశముంది. ప్రధానిగా మోడీ మరోసారి పగ్గాలు చేపట్టనున్నప్పటికీ సంప్రదాయం ప్రకారం ఆయన మంత్రివర్గాన్ని రద్దు చేసి రాష్ట్రపతికి రాజీనామా లేఖ అందజేయాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ కోవింద్ దాన్ని ఆమోదించిన అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ కార్యవర్గం సాయంత్రం భేటీ అయ్యే అవకాశముంది. కేబినెట్ రద్దు‌తో పాటు కొత్త మంత్రివర్గానికి సంబంధించి పార్టీ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేబినెట్ సైతం చివరిసారిగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది.

Modi to meet President Ram Nath Kovind

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్జీయేకు 353, యూపీఏకు 92 స్థానాలు రాగా.. ఇతరులు 97స్థానాల్లో గెలుపొందారు. 2014లో వారణాసి నుంచి గెలిచిన మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా బీజేపీ విజయ దుందుభి మోగించడంతో మే 30న వరుసగా రెండోసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

English summary
Prime Minister Narendra Modi to meet President Ram Nath Kovind later today. He may submit his resignation to president. BJP is expected to meet and pass a resolution today evening to dissolve the existing set of ministers and decide the new lot. The Council of Ministers will also meet today to decide the future course of action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X