వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ నెల 6న ఒడిశాకు మోదీ..! ఫొని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!!

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్/హైదరాబాద్ : ఫొని తుపాను సహాయ చర్యలపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒడిశా, ఏపీ, బంగాల్ లో చేపట్టిన సహాయ చర్యలపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపేందకు సమాయత్తం అవుతోంది. పూరీ, భువనేశ్వర్లో సమాచార, విద్యుత్ వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయన్న ఒడిశా ప్రభుత్వం ముంపుప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తగ్గిందని పేర్కొంది. తుపాను తమ రాష్ట్రంపై కొద్దిపాటి ప్రభావం చూపిందని బంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో పెద్దఎత్తున పంటలు, రోడ్లు పాడయ్యాయని ఏపి ప్రభుత్వం నిర్ధారించింది. ఒడిశాలో సహాయచర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా ఆదేశాలు జారీ చేసారు. భువనేశ్వర్ లో ఇవాళ విద్యుత్ పునరుద్ధరణ పూర్తవుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.

Modi to Odisha on 6th of this month.!Aerial survey conducted in Phoni affected areas..!!

భువనేశ్వర్ లో ఇప్పటికే విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భువనేశ్వర్ నుంచి రైళ్లు నడుపుతున్నట్లు అదికారులు చెప్పుకొస్తున్నారు. ఒడిశాలో సహాయ చర్యల కోసం అదనంగా 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్టు తెలుస్తోంది. చెట్లు, స్తంభాలు తొలగించి రాకపోకలు పునరుద్ధరించామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒడిశాలో రేపు జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా వేసినట్లు వైద్యశాఖ అదికారులు పేర్కొన్నారు. సహాయచర్యలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు, కేంద్ర, రాష్ట్ర విభాగాలకు క్యాబినెట్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసారు. సహాయ సామగ్రిని ఉచితంగా తరలించాలని రైల్వే, విమానయాన శాఖలకు ఆదేశాలు జారీ అయ్యయి. ఐతై జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రధాని మోదీ ఈచ నెల ఆరో తారీఖున ఒడిశా,బెంగాల్ తో పాటు ఏపి రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.

English summary
The National Disaster Management Committee is planning a review of the Phoni rescue operations. Odisha, AP, and Bengal are taking part in a full review of the relief efforts.Prime minister modi to conduct arial survey on 6th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X