వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురువుకు పాదాభివందనం.. అద్వానీ ఆశీర్వాదం తీసుకున్న మోడీ (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ‌లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సునామీ సృష్టించిన ప్రధాని నరేంద్రమోడీ బీజీపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని కలిశారు. రాజకీయ గురువు ఆశీస్సులు తీసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ఉదయం అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ.. ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ సాధించిన సీట్లు, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ ఏర్పాటు తదతర అంశాలపై అద్వానీతో చర్చించినట్లు తెలుస్తోంది.

అద్వానీతో భేటీకి సంబంధించిన ఫోటోలను మోడీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. "అద్వానీ లాంటి గొప్ప నేతలు పార్టీని బలోపతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువచేయడం వల్లే బీజేపీ ఈవిజయాన్ని సాధించింది" అని మోడీ ట్వీట్ చేశారు.

Modi took blessings of Advani, Joshi

అద్వానీతో భేటీ అనంతరం మోడీ, అమిత్ షాలు మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లారు. వారిని ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మోడీ జోషి ఆశీర్వాదం తీసుకున్నారు.

గొప్ప విద్యావేత్త, మేథో సంపత్తి, సమర్థత కలిసిన నేత డాక్టర్ మురళీ మనోహర్ జోషి. భారత విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన సేవలు అమూల్యం. బీజేపీ బలోపేతానికి ఆయన ఎనలేని కృషి చేశారు. నాతో పాటు ఎంతో మంది కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు అని మోడీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

English summary
Prime Minister Narendra Modi and BJP chief Amit Shah Friday called on party veterans LK Advani and Murli Manohar Joshi, a day after the party-led NDA returned to power at the Centre with a massive mandate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X