వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువ ఓటర్లు పోటెత్తాలని మోడీ పిలుపు.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు...

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. అక్కడక్కడా స్వల్ప అవాంతరాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. పలువురు రాజకీయ నాయకులు సైతం క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధాని మోడీ అభ్యర్థించారు.

యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలుయూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలు

యువ ఓటర్లకు మోడీ పిలుపు

ఐదో దశ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు... మెరుగైన దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో యువ స్నేహితులంతా రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.

బీజేపీ గెలుపుపై రాజ్‌నాథ్ ధీమా

బీజేపీ గెలుపుపై రాజ్‌నాథ్ ధీమా

కేంద్ర హోం శాఖ మంత్రి, లక్నో బీజేపీ అభ్యర్థి రాజ్‌నాథ్ సింగ్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం లక్నోలోని స్కాలర్స్ హోం స్కూల్‌లోని పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ గెలుపు తథ్యమని అన్నారు.

జైపూర్‌లో రాజ్యవర్థన్ సింగ్

జైపూర్‌లో రాజ్యవర్థన్ సింగ్

కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఓటు వేశారు. ఉదయం భార్య గాయత్రి రాథోడ్‌తో కలిసి జైపూర్ పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. క్యూలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒలింపియన్ అయిన రాజ్యవర్థన్ జైపూర్ రూరల్ నుంచి బరిలో దిగగా.. ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి మరో ఒలింపియన్ కృష్ణ పునియా పోటీ చేస్తున్నారు.
మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, సతీమణి నీలిమా సిన్హాతో కలిసి జార్ఖండ్‌లోని హజారీ బాగ్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన కుమారుడు హజారీబాగ్ బీజేపీ అభ్యర్థి జయంత్ సిన్హా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

లక్నోలో మాయావతి ఓటు

లక్నోలో మాయావతి ఓటు

బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి లక్నోలో ఓటు వేశారు. మాంటిస్సోరి ఇంటర్ కాలేజీలో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

English summary
As India geared up to vote in the fifth phase of the general election, Prime Minister Narendra Modi tweeted and urged people to come out in large numbers to vote. In this phase, Rajnath Singh, Rajyavardhan Rathore, jayanth sinha, mayawati cast their vote in fifth phase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X