వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కలిసి పనిచేద్దామన్నారు.. రాష్ట్రపతి పదవీపై... శరద్ పవార్

|
Google Oneindia TeluguNews

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కలిసి పనిచేద్దామని చెప్పినట్టు పేర్కొన్నారు. కానీ ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు తెలిపారు. సోమవారం మరాఠీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ కామెంట్లు చేశారు.

మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్‌తో భేటీ తర్వాత మారిన సీన్మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్‌తో భేటీ తర్వాత మారిన సీన్

వ్యక్తిగతంగా ఓకే..

వ్యక్తిగతంగా ఓకే..

మోడీతో తనకు వ్యక్తిగతంగా సన్నిహత సంబంధాలు ఉన్నాయని శరద్ పవార్ తెలిపారు. కానీ పార్టీ పరంగా విభేదాలు ఉన్నాయని చెప్పారు. అందుకే మోడీ కలిసి పనిచేస్తామని చెప్పినా.. సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పారు.

రాష్ట్రపతి పదవీ లేదు..

రాష్ట్రపతి పదవీ లేదు..


తనకు రాష్ట్రపతి పదవీ ఇస్తామని కేంద్రప్రభుత్వం నుంచి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ తన కూతురు సుప్రియ సులేకు కేంద్రమంత్రి పదవీ మాత్రం ఇస్తారని చెప్పినట్టు పేర్కొన్నారు. సుప్రియ సులే బారామతి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మోడీతో భేటీ

మోడీతో భేటీ


గతనెలలో ప్రధాని మోడీతో శరద్ పవార్ సమావేశమయ్యారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవీ చేపట్టడం, డిప్యూటీగా అజిత్ పవార్ చేపట్టిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో.. మహారాష్ట్రలో మహా డ్రామా ముగిసింది. అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్.. బలనిరూపణకు ముందే రాజీనామా చేయడంతో మహా సంక్షోభం ముగిసింది.

రాజ్యసభ 250వ సెషన్‌లో

రాజ్యసభ 250వ సెషన్‌లో

ఇప్పుడే కాదు రాజ్యసభ 250 సమావేశాల సందర్భంగా శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలను ప్రధాని మోడీ కొనియాడారు. వారిని చూసి నేర్చుకోవాలని కూడా సూచించారు. వారు ఎలా వ్యవహరిస్తారు, హుందాగా మెలగుతారు, వెల్‌లోకి దూసుకురారని పేర్కొన్నారు.

English summary
ncp chief Sharad Pawar has said Prime Minister Narendra Modi had proposed "working together" but he rejected the offer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X