ఆ 40 సీట్లు మినహాయించినా మోడీయే ప్రధాని: వైగో
చెన్నై: వచ్చే లోకసభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలోని 40 స్థానాలను లెక్కలోకి తీసుకోకుండానే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ఎండిఎంకె నాయకుడు వైగో అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలు మోడీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు.
‘దేశ వ్యాప్తంగా మోడీ ప్రభావం ఉంది. అతడు తమిళనాడు, పాండిచ్చేరిల్లోని 40 లోకసభ స్థానాలను పరిగణలోకి తీసుకోకుండానే ప్రధాని కాగలరు' అని వైగో తెలిపారు. ఇటీవలే బిజెపితో ఎండిఎంకె పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. శనివారం ఎండిఎంకె పార్టీ మెనిఫెస్టో విడుదల చేసిన సందర్బంగా వైగో పై విధంగా స్పందించారు.

ఎండిఎంకె తమిళనాడు రాష్ట్రంలోని ఏడు స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ఏఐఏడిఎంకెకు తప్ప ఏ పార్టీకి ఓటు వేసినా వృథాయేనని చెప్పారని, అయితే ప్రజలకు ఏ పార్టీకి ఓటు వేయాలో తెలుసునని వైగో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టే అవకాశమేలేదని ఆయన అన్నారు. బిజెపి, బిజెపికి మద్దతు తెలిపే పార్టీలకు తప్ప ఏ పార్టీకి ఓటు వేసినా ప్రయోజనం ఉండదని వైగో తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే పార్టీలను కూడా ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. కాగా, వైగో విరుధ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications