వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడి, మోదీ, కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భారతమాత కోసం ఆసువులు బాసిన జవాన్ల వీర మరణంతో రాలిన ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ప్రధాని మోదీ. కానీ ఇప్పుడు ఓపిక పట్టాల్సిన సమయం అన్నారు. కానీ ఉగ్ర మూకలను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే పరిస్థితి లేదన్నారు. మహారాష్ట్రలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బహిరంగ సభల్లో ఉగ్ర మూకలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వేగంగా మారుతున్న పరిణామాలు..
మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. తర్వాత ఐబీ, రా అధిపతులతో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుల్వామా ఉగ్ర దాడిని ఖండిస్తోన్న నేతలు .. తగిన కార్యాచరణ కోసం ఆయా పార్టీల నేతలు, అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

మమత అంజలి
వీర జవాన్ల కోసం కోల్ కతాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Modi will take revenge on every tear blot.

శర్మ షో నుంచి సిద్దూ ఔట్
కాంగ్రెస్ నేత సిద్దూ నోటి దూలతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ .. కపిల్ శర్మ షో నుంచి తప్పిస్తూ చానెల్ యాజమాన్యం నిర్ణయిం తీసుకుంది. ఉగ్రవాదులకు మతం, జాతి ఉండదని సిద్దూ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరో మేజర్ బలి
కశ్మీర్ లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. రాజౌరి సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద ఓ మేజర్ ను ముష్కరులు మట్టుబెట్టారు. నియంత్రణ రేఖను అనుకొని కిలోమీటర్ దూరంలో ఉగ్రవాదులు ఐఈడీ బాంబును పెట్టారు. అక్కడ విధులు నిర్వరిస్తున్న అధికారి బాంబును చూసి నిర్విర్యం చేస్తుండగా బాంబు పేలింది. దీంతో మేజర్ కూడా ఆసువులు బాసారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday warned the attackers that each drop of tear that the families of CRPF jawans have shed will be avenged. "This is the time for patience. But I assure everyone that the perpetrators will not be spared," he said in Maharashtra. Meanwhile, Bengal chief minister Mamata Banerjee is participating in a candlelight march in Kolkata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X