చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోబ్యాక్ శాడిస్ట్ మోడీ.. అవసరంలేదు వెళ్లిపోండి: ట్విట్టర్‌లో మోడీపై తమిళ పులుల నిరసన

|
Google Oneindia TeluguNews

Recommended Video

#GoBackModi : Ahed Of Modi-Xi Visit, #GoBackModi Trending On Twitter || #మోడీగోబ్యాక్ || Oneindia

చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ తమిళనాడులోని మామల్లాపురంలో శుక్రవారం (అక్టోబర్ 11) భేటీ కానున్నారు. ఇరువురి మధ్య ఇది రెండో అనధికార భేటీ. రెండు దేశాల అగ్ర నాయకుల భేటీ కోసం ఇరుపక్షాల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేశారు. అయనప్పటికి ఇది అనధికార భేటీయే. ప్రత్యేక అజెండా ఏమీ లేదు. ఏ విషయమైనా మాట్లాడుకోవచ్చు. వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. మోడీ - జీ జిన్‌పింగ్ భేటీ నేపథ్యంలో ట్విట్టర్‌లో వివిధ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#GoBackModi
#TNWelcomesModi
#TN_welcomes_XiJinping
వంటి హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

మీరు అవసరం లేదు.. మేం ఆహ్వానించం..

గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్స్ పెద్ద ఎత్తున ట్వీట్ చేస్తున్నారు. ఇందులో కూడా అనుకూలంగా, వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్నారు. ఫ్రీ కాశ్మీర్కావాలని, ఎన్ఆర్సీని తొలగించాలని, మోబ్ లించింగ్ ఆపాలని, అల్లర్లు ఉండవద్దని ఓ ట్విట్టరిటీ పేర్కొన్నారు. ఈ కారణంగా తాను గో బ్యాక్ మోడీ అనే నినాదం ఇస్తున్నట్లు తెలిపారు. మీరు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని, మేం ఆహ్వానించమని పేర్కొన్నారు.

స్టుపిడ్ ట్రెండ్

రేపు గో బ్యాక్ మోడీ ట్రెండ్ అవుతుందని, యాంటీ నేషనల్స్ రెచ్చిపోతారని, కాబట్టి అలాంటి ట్రెండ్ ఉండకూడదని ఓ నెటిజన్ గురువారం (అక్టోబర్ 10) ట్వీట్ చేశారు. దీనిని కృతిక అనే ట్విట్టరిటీ రీట్వీట్ చేస్తూ... ఇలాంటి ట్విట్టర్ ట్రెండ్స్‌ను పరిగణలోకి తీసుకోవద్దని అభిప్రాయపడ్డారు. ఇలాంటి స్టుపిడ్ ట్రెండ్‌ను పరిగణలోకి తీసుకుంటారని భావించడం లేదన్నారు.

గో బ్యాక్ మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు తమిళనాడు వచ్చినా గో బ్యాక్ అంటూ మరో ట్విట్టరిటీ పేర్కొన్నారు. వారు (మోడీకి అనుకూలంగా వెల్ కమ్ మోడీ) వచ్చినా మన నినాదం గో బ్యాక్ మోడీనే అని మరో ట్విట్టరిటీ అభిప్రాయపడ్డారు.

చైనా వ్యూహాత్మకంగా మహాబలిపురాన్ని ఎంచుకుందా?

జీ జిన్‌పింగ్-మోడీ భేటీ కోసం మహాబలిపురాన్ని భారత్ ఎంచుకోలేదని, వ్యూహాత్మకంగా చైనా ఎంచుకుందని అంటున్నారు. మోడీకి ఎక్కడైతే ఘన స్వాగతం లభించదో ఆ ప్రాంతాన్ని కావాలని చైనా ఎంచుకుందని మరో ట్విట్టరిటీ పేర్కొన్నారు.

మోడీకి ఇలా.. జిన్‌పింగ్‌కు అలా...

చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం పలుకుతున్నట్లు, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి తిరస్కరిస్తున్నట్లు ఓ సినిమా పిక్‌ను మరో ట్విట్టరిటీ పోస్ట్ చేశారు.

ఎప్పుడొచ్చినా ఇంతే..

మోడీ ఎప్పుడు తమిళనాడు లేదా చెన్నైకి వచ్చినా గో బ్యాక్ మోడీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తామని స్వర వైతీ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.

తమిళనాడు వెల్ కమ్ మోడీ

ఓ వైపు గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, మరోవైపు తమిళనాడు వెల్ కమ్ మోడీ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. మోడీకి వీరు ఘన స్వాగతం పలుకుతున్నారు. కాగా, మా పోరాలిస్‌ను అంతర్జాతీయ పేరోల్‌కు తీసుకు వెళ్తున్నందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని రాజీ సుబ్రమణియన్ అనే ట్విట్టరిటీ పేర్కొన్నారు.

మోడీ ఇండియా బాస్

నరేంద్ర మోడీ ఇండియా బాస్ అని, గో బ్యాక్ మోడీ అని నినదిస్తున్న ఈ యాంటీ నేషనల్ దోమలకు అతనిని అడ్డుకునే సత్తా ఉందా... ఇలాంటి స్టుపిడ్ ట్రెండ్‌తో అరవడం తప్ప వారు చేసేదేమీ లేదని మరో నెటిజన్ పేర్కొన్నారు.

మోడీ తమిళనాడుకు ఏం చేశారంటే...

మోడీ తమిళనాడుకు ఎంతో ఇచ్చారని, ఎక్కువ ముద్రా లోన్లు ఇచ్చారని, రూ.2 లక్షల కోట్ల రోడ్డు ప్రాజెక్టు ఇచ్చారని, మోడర్న్ రైల్వే స్టేషన్స్ మంజూరు చేశారని, కొత్త ఎయిర్ పోర్టులు తీసుకు వచ్చారని, అందరికీ అందుబాటులో ఉండేలా విమాన ఛార్జీలు దిగివచ్చాయని, నగరాలు శుభ్రంగా ఉంటున్నాయని, 12 స్మార్ట్ సిటీలను, 32 అమృత్ సిటీలను ఎంపిక చేశారని, తమిళనాడుకు ఏఐఐఎంఎస్ హాస్పిటల్ ఇచ్చారని.. ఇలాంటి మోడీకి తమిళనాడు ఆహ్వానిస్తోందని మాధవ్ అనే నెటిజన్ పేర్కొన్నారు.

గో బ్యాక్ ఫాసిస్ట్ మోడీ

ఉదయం గో బ్యాక్ మోడీతో ప్రారంభమైన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ కాగా, సాయంత్రానికి గో బ్యాక్ సాడిస్ట్ మోడీ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. ఫాసిస్ట్‌కు పెరియార్ భూమి (తమిళనాడు)లో అడుగు పెట్టే హక్కు లేదని, బీజేపీ ఐటీ సెల్ వెల్ కమ్ మోడీ కోసం రాత్రంతా పని చేసిందని, అయినా ఫలితం లేదని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.

గో బ్యాక్..

ఈ భూమి తమిళ టైగర్స్‌ది అని, ఇక్కడ ఫాసిస్ట్, హిట్లర్లకు చోటు లేదని, ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ లకు చోటు లేదని చెబుతూ మరొకరు ట్వీట్ చేశారు. గో బ్యాక్ శాడిస్ట్ మోడీ, గో బ్యాక్ మోడీ, గో బ్యాక్ జిన్ పింగ్, గో బ్యాంగ్ జిన్ పింగ్ మోడీ అని హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉపయోగిస్తున్నారు.

English summary
Go Back Modi again trending in twitter. 'How come so many people are in twitter up and awake, this early in the morning today? We never slept in the first place, and #GoBackModi is the secret of our energy.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X