వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ-జిన్‌పింగ్‌ సమావేశం: మీటింగ్ షెడ్యూల్ ఇదే..!

|
Google Oneindia TeluguNews

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుక్రవారం మధ్యాహ్నం భారత్‌కు రానున్నారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో జిన్‌పింగ్ ల్యాండ్ అయ్యాక నేరుగా ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌కు వెళతారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన మహాబలిపురం బయలుదేరి వెళతారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో అనధికారిక సమావేశంలో పాల్గొంటారు. ఇరు దేశాల అగ్రనేతల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక సమావేశం ఇది. 2018లో డొక్లాం వివాదం తర్వాత నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వూహాన్ నగరంలో భేటీ అయ్యారు.

 మోడీ-జిన్ పింగ్ సమావేశం: మహాబలిపురంనే వేదికగా ఎందుకు ఎంచుకున్నారు..? మోడీ-జిన్ పింగ్ సమావేశం: మహాబలిపురంనే వేదికగా ఎందుకు ఎంచుకున్నారు..?

ఒక ప్రత్యేక అజెండా అంటూ లేకుండానే ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే కశ్మీర్ అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్ వాస్తవాధీనరేఖ వద్ద భధ్రతా చర్యలపై కూడా ఇరుదేశాధినేతలు చర్చించే అవకాశం ఉంది. జిన్‌పింగ్‌తో పాటు చైనా దౌత్యాధికారి వాంగ్ యీ వస్తుండగా... ప్రధాని మోడీతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌లు ఉంటారు. ఈ అనధికారిక భేటీలో కొన్ని అంశాలను పరిశీలిద్దాం.

Modi-Xi Jinping summit:Here is the full schedule of the meet

1. ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు మధ్య వ్యక్తిగతంగా స్నేహం ఉండటంతో ఇరుదేశాల మధ్య విబేధాలు పక్కనపెడితే వీరి చర్చలతో మంచి సంబంధాలకు బీజం పడుతుందనే ఆశాభావం ఇరుదేశాల్లో వ్యక్తమవుతోంది

2. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం ఇప్పటికీ ముగియలేదు. చైనాతో భారత్‌కు 3500 కిలోమీటర్ల మేరా సరిహద్దు కలిగి ఉంది.ఈ వివాదం పరిష్కారం కోసం ఇప్పటికే 20 సార్లు చర్చలు జరిగాయి. అంతేకాదు 1962లో యుద్ధం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ సరిహద్దులో ప్రశాంతవాతావరణం నెలకొంది. అప్పుడప్పుడు ఇరుదేశాల సైనికుల మధ్య మాత్రం కాస్త రగడ జరిగేది.

3. భారత్‌కు చేరుకున్న తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను భారత ప్రధాని మహాబలిపురంకు తీసుకెళతారు.అక్కడే కొన్ని గంటల పాటు ఇద్దరూ సమయం గడిపి పలు అంశాలపై మాట్లాడతారు. సరిహద్దుల వివాదం నుంచి చైనాతో వాణిజ్య సంబంధాల పై వీరు చర్చించే అవకాశాలున్నాయి. చైనా టెలికాం నెట్‌వర్క్ హువాయ్‌ తన పరికరాలను భారత్ 5జీ నెట్‌వర్క్‌కు అందజేయడంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

4.ప్రధాని నరేంద్ర మోడీతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ లోతైన చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ద్వైపాక్షి సంబంధాలపై వ్యూహాత్మక చర్చలు జరిగే అవకాశం ఉందని చైనా డిప్యూటీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి లూ జాహుయ్‌ చెప్పారు.

5. ఇక చైనా పరంగా టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు దలైలామా అంశంను ప్రస్తావించే అవకాశం ఉంది. 1959లో జరిగిన అల్లర్ల తర్వాత దలైలామా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ధర్మశాల వేదికగా ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

6. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మహాబలిపురంకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఎర్రతివాచీతో ఘనస్వాగతం పలకనున్నారు. చైనాతో మహాబలిపురంకు ప్రాచీన సంబంధాలు ఉండటంతో ఆ నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చి దిద్దాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

7. మహాబలిపురంకు చేరుకోగానే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రధాని మోడీ చారిత్రక కట్టడాల వద్దకు తీసుకెళుతారు. పంచరథాలు, సముద్రతీరంలోని ఆలయం లాంటివి జిన్‌పింగ్‌కు చూపిస్తారు. ఆలయంలో ఏర్పాటు చేసిన పలు సాంస్క‌ృతిక కార్యక్రమాలను జిన్‌పింగ్ మోడీ వీక్షిస్తారు

8.ఆ తర్వాత ఓ లాన్‌లో కూర్చొని ఇద్దరు నేతలు అభివృద్ధి సహకారంపై పరస్పర ఆలోచనలను పంచుకుంటారు.

9.ఇద్దరి నేతల మధ్య చర్చలు ముగిసిన తర్వాత ఆలయం కాంప్లెక్స్‌లోనే ప్రధాని నరేంద్ర మోడీ అతిథికి విందును ఏర్పాటు చేశారు.

10.శనివారం రోజున మోడీ - జిన్‌పింగ్‌లు ఓ రిసార్టులో భేటీ అవుతారు. అక్కడ కొన్ని అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విందును ఏర్పాటు చేస్తారు ప్రధాని మోడీ. ఆ తర్వాత అంటే మధ్యాహ్నం 1:30 గంటలకు జిన్‌పింగ్ చెన్నై విమానాశ్రయంకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 4 గంటలకు చెన్నై నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ బయలుదేరి వెళతారు

English summary
Chinese President Xi Jinping will land in Chennai today afternoon to take part in an "informal summit" with Prime Minister Narendra Modi in the coastal town of Mamallapuram in Tamil Nadu. This will be the second informal summit between PM Modi and President Xi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X