వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘మోకాళ్లపై కూర్చుని ప్రాధేయపడండి.. లేదంటే రేప్ చేస్తాం..’’

కన్నడ భాష రానందుకు ఓ మహిళపై నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉత్తర బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కన్నడ భాష రానందుకు ఓ మహిళపై నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను ఇష్టమొచ్చినట్లు తిట్టి చేయి చేసుకుని అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాధితురాలి వివరాల ప్రకారం... రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆమె తన స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగొస్తుండగా వారితో ఓ వీధిలో కొంతమంది గడవ పడ్డారు. వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయి వారి వద్దకు వచ్చి కన్నడ భాషలో ఏదైనా మాట్లాడమని అడిగాడు.

అనంతరం కన్నడ భాషలోనే వారిని అనకూడని మాటలు అన్నాడు. అతడేమన్నాడో వారికి అర్థం కాకపోవడంతో మిగిలిన వ్యక్తులు కూడా వారి దగ్గరికొచ్చి కర్ణాటకలో ఉంటూ, కర్ణాటకలో తింటూ కన్నడంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటూ తిట్టారు.

Molestation horror in Bengaluru: Woman molested, slapped as she couldn't speak Kannada

''మీరు స్థానికులు కాదు, కన్నడ భాష కూడా రాదు, అందుకని మోకాళ్లపై కూర్చుని క్షమించాలని ప్రాధేయపడండి.. లేదంటే రేప్ చేస్తాం..''అని బెదిరించారు. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల్లో ఈ లైంగిక వేధింపులు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలిసిందే.

ఆ ఘటన తరువాత మళ్లీ ఇప్పుడు ఈ రకమైన సంఘటన జరగడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై బాధితురాలు మాట్లాడుతూ 'ఈ నగరంలో ఇంకొక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు, నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతాను..'అంటూ వ్యాఖ్యానించిందంటే.. ఆమెను వారెంత ఇబ్బంది పెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

English summary
Bengaluru: In yet another shocking incident, a woman was allegedly molested by a group of people for not knowing the Kannada language. The victim approached the city police and registered a complaint against unknown persons after which the four people were arrested. The incident took place in north Bengaluru on Sunday at 9:30 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X