వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హృదయ విదారకరం: ఐసీయూలో బెడ్ లేక తల్లి, టాయ్‌లెట్‌లో కుళ్లి నానమ్మ మృతి, విషాదంలో...

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో దారుణం జరిగింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండగా.. ఓ కుటుంబాన్ని వైరస్ విచ్చిన్నం చేసింది. తల్లికి ఐసీయూలో బెడ్ దొరకక చనిపోగా, నానమ్మ ఆస్పత్రి టాయ్‌లెట్‌లో విగతజీవిగా కనిపించింది. ఓకే ఇంట్లో ఇద్దరూ చనిపోవడం విషాదం నింపింది.

 ఇద్దరు మృతితో..

ఇద్దరు మృతితో..

జల్గావ్ జిల్లాలో హర్షల్ నెహతా ఫ్యామిలీ ఉంటోంది. ఇతను ఉపాధి కోసం పుణెలో ఉంటున్నారు. ఇతని భార్య మరో నెలరోజుల్లో డెలివరీ కాబోతుంది. తండ్రి తులసీరాం కరోనా వైరస్ సోకి.. నాసిక్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అయితే హర్షల్ తల్లి టీనా, నానమ్మ మాలతీకి కూడా వైరస్ సోకింది. దీంతో వారిద్దరూ కూడా చనిపోయారు. కానీ వారిద్దరూ మృతి మాత్రం.. హృదయ విదారకరంగా జరిగింది. వైరస్ సోకడంతో టీనాను జల్గావ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఐసీయూలో బెడ్ లేకపోవడంతో దాదాపు ఆరు గంటలపాటు నిరీక్షించారు. చివరికి ఆమె చనిపోయారు.

కుళ్లిపోయిన మృతదేహం

కుళ్లిపోయిన మృతదేహం

తల్లి చనిపోయిందన్న బాధ్యతో హర్షల్ మెహతా ఫ్యామిలీ ఉన్న సమయంలో.. అదే ఆస్పత్రిలో ఓ కుళ్లిపోయిన శవం కనిపించింది. అదీ మాలతీగా గుర్తించారు. ఆస్పత్రి టాయ్‌లెట్ గదిలో మాలతీ అచేతనంగా కనిపించారు. బుధవారం రోజున టాయ్‌లెట్ క్యుబికల్ ఓపెన్ చేయడంతో మృతదేహం కనిపించింది. కానీ ఆమె అందులో ఎలా పడిపోయారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ నెల 2వ తేదీన వృద్దురాలు ఆస్పత్రికి వచ్చారని.. ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరమని చెప్పామని సిబ్బంది చెబుతున్నారు. కానీ వెళ్లిపోయిన మాలతీ మాత్రం టాయ్ లెట్ గదిలో పడిపోయి.. ఊపిరాడక చనిపోయారు.

 8 రోజుల నుంచి

8 రోజుల నుంచి

ఎనిమిది రోజుల నుంచి ఎవరూ తీయలేదు. దీంతో కంపు కొట్టడంతో ఇతర రోగులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు ఓపెన్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు స్పందించారు. డీన్ ఖైర్ సహా ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సంజయ్ ముఖర్జీ అధికారులను ఆదేశించారు. మాలతీ కంటే ముందు మరో ముగ్గురు కూడా ఇలానే చనిపోయారని తెలుస్తోంది.

English summary
mom dead:harshal Nehete is a marketing executive who lives in Pune. his mother dead in hospital because no bed in icu. grandmother deadbody found in toilet cubicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X