• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమ్మను ఉరేయండి.. తాతకు పిల్లల డిమాండ్.. ఏం జరిగిందో తెలుసా..?

|

చండీగఢ్ : ఔను ఇది కలికాలమే. బంధాలు, అనుబంధాలు లేవు, అనురాగాలు, ఆప్యాయతలు తెలియవు. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం అంటే ఏంటో తెలియదు. కట్టుకున్న భర్తను, మూడుముళ్లు వేసిన భార్యను మట్టుబెడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తోంది. ఇదేనేమో కలికాలం అంటే .. వింత చర్యలతో నిజమేననిపిస్తోంది.

 ఇదీ విషయం ..

ఇదీ విషయం ..

పంజాబ్‌లో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తనే మట్టుబెట్టింది అభినవ సతీ. తర్న్ తరణ్ గ్రామానికి చెందిన రాజ్‌ప్రీత్ సింగ్, సిమ్రాన్ కౌర్ 12 ఏళ్ల కింద ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్ల నుంచి సిమ్రాన్ ప్రవర్తనలో మార్పు వస్తోంది. ఏంటా అని ఆరాతీస్తే ఆమె లవ్‌ప్రీత్ సింగ్‌తో వివాహేతర సబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి రాజ్‌ప్రీత్ మదనపడ్డారు. సిమ్రాన్‌ను ఆరాతీశారు. తీరు మార్చుకోవాలని స్పష్టంచేశారు. కూతురి కాపురాన్ని సరిదిద్దేందుకు సిమ్రాన్ తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. భర్త, పిల్లలు ఉన్నందున బుద్దిగా ఉండాలని సూచించారు. అయినా సిమ్రాన్ మారలేదు.

భర్తనే మట్టుబెట్టింది ..

భర్తనే మట్టుబెట్టింది ..

అయితే సిమ్రాన్ ప్రవర్తనపై ఇంటా బయట ఒత్తిడి రావడంతో తట్టుకోలేకపోయింది. ఇక లాభం లేదనుకుంది. తన అక్రమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్తనే మట్టుపెట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆదివారం విషం కలిపిన భోజనాన్ని వడ్డించింది. ఇంక తన భర్త చావలేదని భావించి .. ఉరేసి చంపేసింది. అయితే ఈ దారుణాన్ని ఆమె పిల్లలు కళ్లారా చూశారు. తర్వాత పిల్లలను తమ పుట్టింట్లో దించేసి .. ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

అమ్మను ఉరేయండి ..

అమ్మను ఉరేయండి ..

జరిగిన దారుణాన్ని తమ తాతకు తెలిపారు పిల్లలు. అమ్మే నాన్నను ఉరేసి చంపిందని పేర్కొన్నారు. తమ కళ్ల ముందే దారుణం జరిగిందని వివరించారు. అయితే నాన్నను తమకు దూరం చేసిన అమ్మకు ... కూడా అలానే శిక్ష విధించాలని కోరుతున్నారు. అమ్మను ఉరేసి చంపాలని కోరుతున్నారు. పసిపిల్లలు మనస్సులో తల్లిపై ఇలాంటి అభిప్రాయం కలుగడం కాస్త జీర్ణించుకోలేని అంశమే. కానీ ఆమె తీరు కూడా అదేస్థాయిలో ఉంది. కట్టుకున్న భర్తను చంపడాన్ని సమాజం అంగీకరించదు. ముగ్గురు పిల్లలకు తండ్రిని దూరం చేసి . ప్రియుడితో ఏంచక్కా కూలుకుతుందా అని ప్రశ్నిస్తున్నారు. జరిగిన ఘటన గురించి తెలుసుకొని ఆ తాత మదనడపడ్డాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లవ్‌ప్రీత్, సిమ్రాన్ ఆచూకీ కోసం పోలీసులు విసృతంగా గాలిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The worst happened in Punjab. Rajpreet Singh and Simran Kaur of Tarn Taran village were united under the age of 12. They also have three children. But Simran's behavior has been changing over the years. She is still in an extramarital affair with Lovepreet Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more