వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోనార్క్ రాజ‌కీయ అరంగేట్రం..! తెలంగాణ నుంచా..? ఏపి నుంచా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Prakash Raj Contests In 2019 Elections? నూతన సంవత్సరం లో ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ

హైద‌రాబాద్ : ప‌దునైన చూపు.. శ‌త్రువు గుంగెల్లో గుబులు పుట్టించే మాట తీరు, సింహా లాంటి ఆహార్యం, ఏ పాత్ర వేసినా వంద‌కు రెండొంద‌ల శాతం ఒదిగి పోయే శ‌రీరాక్రుతి..! పొలంప‌నులు చేసే రైత‌న్న‌గాని, ప్ర‌పంచాన్ని వ‌ణికించే డాన్ గాని, అవినీతి ప‌రుల భ‌ర‌తం ప‌ట్టించే సీబీఐ ఆఫీస‌ర్ పాత్ర గాని.. ప్ర‌త్య‌ర్థుల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా ఉండే రాజ‌కీయ నాయ‌కుడి గెట‌ప్ గాని.. ఇలా ఏ పాత్ర పోషించినా ఆయ‌న త‌ర‌వాతే ఎవ‌రైనా అనేంత న‌ట శిఖ‌రాల‌కు చేరుకున్న బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్ రాజ్. సినిమా రంగంలో నిరూపించుకోవ‌డానికి ఇక మిగిలిందేమి లేదంటూ ఆయ‌న చూపు రాజ‌కీయాల‌వైపు ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని త‌నే ట్విట్ట‌ర్ ద్వారా నిర్దారించారు. ఐతే ప్ర‌కాష్ రాజ్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఆయ‌న చేరే పార్లీ ఏది..? తెలంగాణ నుండి పోటీ చేస్తారా లేక ఏపి నుంచా..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కి ప్ర‌కాష్ రాజ్..! ఏపార్టీ నుంచి అనేదే ఉత్కంఠ‌..!

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కి ప్ర‌కాష్ రాజ్..! ఏపార్టీ నుంచి అనేదే ఉత్కంఠ‌..!

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. తన రాజకీయ నిర్ణయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్ధిగా పార్లమెంటుకు పోటీ చేస్తానని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన అభిమానులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు ప్ర‌కాష్ రాజ్. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ నిర్ణయాన్ని కూడా ట్విట్టర్ లో ప్రకటించారు. మీ మద్దతుతో నేను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నానని ప్రకాష్ రాజ్ తెలియజేశారు. అయితే ఏ రాష్ట్రం నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారో వెల్లడించలేదు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తానని ట్వీట్ చేశారు.

సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ ప్ర‌తినాయ‌కుడు..! రాజ‌కీయాల్లో హిట్ కొడ‌తాడా..?

సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ ప్ర‌తినాయ‌కుడు..! రాజ‌కీయాల్లో హిట్ కొడ‌తాడా..?

ఓ ప‌క్క తాను చేసిన సినిమాలు వ‌రుస హిట్ల‌వుతుంటాయి. అన్ని ప్రాతీయ భాషా చిత్రాల్లో గుర్తింపు పొందిన ప్ర‌తినాయ‌కుడు. క్ష‌ణం తీరిక‌లేని సినిమాలు. ఐన‌ప్ప‌టికి ప్ర‌కాష్ రాజ్ చూపు రాజ‌కీయాల‌వైపు ప‌డుతోంది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు విల‌క్ష‌ణ న‌టుడు ఉవ్విళ్లూరుతున్న‌ట్టు చెప్పుకొస్తున్నాడు. వ‌చ్చే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో వీలైతే స్వ‌తంత్య్ర అభ్య‌ర్తిగా పోటీ చేస్తాన‌ని కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్బంగా మోనార్క్ ప్ర‌క‌టించుకున్నాడు.

తెలుగు రాష్ట్రాల‌తో మంచి సంబందాలు..! ఏ పార్టీలో చేర‌తారు..?

తెలుగు రాష్ట్రాల‌తో మంచి సంబందాలు..! ఏ పార్టీలో చేర‌తారు..?

ప్ర‌కాష్ రాజ్ తాను ఎంపీ గా పోటీ చేస్తే ఏ రాష్ట్రం నుండి పోటీ చేస్తార‌నే అంశం ఆస‌క్తి రేపుతోంది. త‌న సొంత రాష్ట్రం ఐన క‌ర్ణాట‌క నుండి పోటీ చేస్తారా లేక తెలుగు రాష్ట‌ల నుండి పోటీ చేస్తారా అన్న‌దే ప్ర‌శ్నార్ధ‌కం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా త‌న‌కు మంచి గుర్తింపు, అభిమానుల్లో ఫాలోయింగ్ ఉండ‌డంతో తాను తెలుగు రాష్ట్రాల నుండి పోటీ చేసే అవ‌కాశాలు లేక‌పోలేద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఐతే తెలంగాణ నుండి ప్ర‌కాష్ రాజ్ పోటీ కి దిగితే ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగుతారా లేక ఏదైనా పార్టీ త‌రుపున పోటీ చేస్తారా అనుఏ అంశం ఉత్కంఠ రేపుతోంది. ఇక ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయ నేత‌ల‌తో కూడా ప్ర‌కాష్ రాజ్ స‌త్సంబంధాలు క‌లిగి ఉండ‌డంతో ఆయ‌న అక్క‌డి నుండి కూడా పోటీ చేసే అవ‌కాశాల‌ను కొట్టి పారేయ‌లేం..!

తెలంగాణ‌తో మంచి అనుబంధం..! ఏపిలో ప్ర‌తిప‌క్ష‌మా..? అదికార ప‌క్ష‌మా..?

తెలంగాణ‌తో మంచి అనుబంధం..! ఏపిలో ప్ర‌తిప‌క్ష‌మా..? అదికార ప‌క్ష‌మా..?

తెలంగాణ లోని పాల‌మూరు జిల్లాలో ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని గ్రామ అభివ్రుద్దిని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్న ప్ర‌కాష్ రాజ్ కు తెలంగాణ రాజ‌కీయాల ప‌ట్ల మంచి అవ‌గాహ‌న ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, ముఖ్య‌మంత్రి చంద్రశేఖ‌ర్ రావును త‌రుచుగా ప్ర‌శంసించే ప్ర‌కాష్ రాజ్ తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్ల సానుకూల ద్రుక్ప‌దాన్ని వ్య‌క్తం చేస్తుంటారు.

ఒక వేళ తెలంగాణ‌లో గులాబీ పార్టీలో చేరి ఎంపిగా పోటీ చేస్తే, కేసీఆర్ అండ‌దండ‌ల‌తో ఆయ‌ర‌న గెలుపు పెద్ద క‌ష్టం కాక‌పోవ‌చ్చ‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. తెలంగాణ నుంచి కాకుండా ఏపి నుంచి పోటీ చేయాల్సి వ‌స్తే ఏ పార్టీ నుండి పోటీ చేస్తార‌నే అంశం ప‌ట్ల కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. చంద్ర‌బాబు విధానాలను త‌రుచుగా విమ‌ర్శించే ప్ర‌కాష్ రాజ్ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ తో స‌త్సంబంధాలు క‌లిగిఉన్న‌ట్టు తెలుస్తోంది. ఒక వేళ ఏపిలో ఎంపిగా పోటీ చేయాల్సివ‌స్తే వైయ‌స్ఎర్సీపి త‌రుపున పోటీ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్టు విశ్వ‌సేనీయంగా తెలుస్తోంది. దీంతో ప్ర‌కాష్ రాజ్ పార్ల మెంట్ లో అడుగు స్వ‌తంత్రంగా ప‌డుతుందా..ఏదైనా పార్టీ త‌రుపున ప‌డుతుందా అనే అంశం తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది.

English summary
Popular film actor Prakash Raj said he was coming into Direct politics.He shared his political decision with Twitter. He posted on Twitter that he would contest Parliament as an independent candidate in the next general election. Prakash Raj has given a new year greetings to his fans and people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X