వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్ల్స్ హాస్టల్‌లో పేద్ద బల్లి: హడలిపోయిన యువతులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

హాస్టల్‌ బాత్రూంలో భారీ బల్లిని చూసి పరుగులు పెట్టిన యువతులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ గర్ల్స్ హాస్టల్‌ బాత్రూంలో కనిపించిన ఓ భారీ బల్లి కలకలం సృష్టించింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఓ విద్యార్థిని ఆ బల్లిని చూసి ఒక్కసారే గావుకేక పెట్టింది. ఏం జరిగిందోనన్న కంగారుతో లేడీస్‌ హాస్టల్‌లోని విద్యార్థునులంతా పరుగున వచ్చారు.

అంతకుముందెన్నడూ చూడనంత పెద్ద బల్లిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే కాలేజీ యాజమాన్యానికి కబురుపెట్టారు. నిమిషాల వ్యవధిలోనే వణ్యప్రాణి సంరక్షకులు వచ్చారు. అది ఆఫ్రికా జాతికి చెందిన విషపూరిత బల్లిగా గుర్తించారు.. జాగ్రత్తగా మత్తుమందు ఎక్కించి, దాన్ని తీసుకెళ్లారు.

Monitor Lizard Found Inside Girls Hostel In Delhi College

ఆఫ్రికా జాతికి చెందిన ఆ విషపూరిత బల్లి కుడితే.. ప్రాణాపాయం ఉండనప్పటికీ తీవ్రమైన అనారోగ్యం, విపరీతమైన నొప్పి కలుగుతాయని వణ్యప్రాణి సంరక్షకులు వివరించారు.

ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నేతాజీ సుభాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఎస్‌ఐటీ)లో మే 16న ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన చెట్ల మధ్యలో క్యాంపస్‌ ఉన్నప్పటికీ.. ఇలాంటి జీవిని ఇదివరకెప్పుడూ చూడలేదని విద్యార్థులు చెబుతున్నారు.

English summary
If lizards have you screaming and running in the opposite direction, we would warn you not to read any further. On May 16, a massive monitor lizard was found inside a girls hostel at Netaji Subhas Institute of Technology (NSIT) in Dwarka, Delhi. A picture of the reptile was shared on Facebook by The Alliance - NSIT's newspaper. "A monitor lizard was found in one of the third floor rooms of Girls Hostel-1. We request all hostel residents to stay safe and keep their rooms closed," they wrote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X