వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. ఆ వానరం మాములిదీ కాదు.. ఒకతనిపై పగ.. మళ్లీ మళ్లీ వచ్చి..

|
Google Oneindia TeluguNews

మూగజీవాలు పగ పట్టడం అరుదు.. విషం ఉండే పాము పగ అంటారు. కోతి లాంటి జంతువు మనిషిని చూస్తే ఎగబడుతుంది.. కానీ దాడులు చేయవు. కానీ కర్ణాటకలో మాత్రం ఓ వానరం మాత్రం నీడలా వెంటాడుతోంది. ఒకతనికి పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. ఓ కోతి వ్యక్తిపై పగ పట్టింది. అధికారులకు పట్టించాడనే కారణంతో అతనిపై కోపం పెంచుకుంది. 22 కిలోమీటర్ల దూరంలో గల అడవిలో వదిలినా.. లారీలో మళ్లీ అదే గ్రామానికి వెళ్లిన కోతి.. సదరు వ్యక్తి కోసం వెతికింది.

చిక్కమగంళూర్‌ జిల్లాలో కొట్టిఘెహరా గ్రామంలో ఐదేళ్ల వయసు గల కోతి స్థానికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేది. ఇళ్ల మీద ఉన్న పెంకులను పడేయడం, పండ్లు, ఆహారాన్ని ఎత్తుకెళ్లేది. బట్టలు, పర్సులను దొంగిలిస్తూ ఉండేది. అయితే గ్రామస్థులు సర్దుకుపోయేవారు. ఇటీవల పాఠశాలలు తెరిచారు. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నప్పుడు ఆ కోతి వారిపై దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కోతిని పట్టుకోవడానికి సెప్టెంబర్‌ 16వ తేదీన గ్రామానికి వచ్చిన అధికారులకు కోతిని పట్టుకోవడం కష్టతరమైంది. దీంతో అదే గ్రామానికి చెందిన జగదీశ్‌ అనే ఆటో డ్రైవర్‌.. కోతిని పట్టుకోవడానికి అధికారులకు సాయం చేశాడు. దీంతో ఎట్టకేలకు ఆ కోతిని అధికారులు పట్టుకున్నారు.

monkey Revenge man, who caught to forest officers

తనను పట్టించిన జగదీశ్‌పై కోపం పెంచుకున్న కోతి.. అప్పటికప్పుడు అధికారుల నుంచి తప్పించుకొని జగదీశ్‌ వెంట పడింది. భయపడిపోయిన అతను ఆటోలో దాక్కున్నాడు. అది గమనించిన కోతి.. ఆటో టాప్‌, సీట్లను చించి వేసి.. జగదీశ్‌పై దాడి చేసి, చెవులను కొరికి.. శరీరాన్ని గాయపర్చింది. అప్రమత్తమైన వెంటనే అధికారులు ఆ కోతిని పట్టుకొని ఊరికి 22 కి.మీ దూరంలోని అడవిలో వదిలేసి వచ్చారు. దీంతో జగదీశ్‌తో పాటు గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.

అధికారులకు పట్టించిన జగదీశ్‌పై పగ చల్లారని కోతి.. ఓ లారీ మీద ఎక్కి బుధవారం మళ్లీ అదే గ్రామానికి వెళ్లింది. జగదీశ్‌ జాడ కోసం ఇంటింటికీ తిరిగింది. కోతి చెవిపై ఉన్న గుర్తును గమనించిన గ్రామస్థులు ఆ కోతి.. మునుపటిదేనని గుర్తించారు. ఊరిలోకి కోతి వచ్చిన విషయాన్ని జగదీశ్‌కు చెప్పారు. దీంతో భయపడిపోయిన అతను.. కోతికి కనబడకుండా తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు కోతిని బంధించి తీసుకెళ్లారు. అయితే ఆ కోతి మళ్లీ వస్తుందనే భయంతో జగదీశ్‌ భయపడుతున్నాడు.

వినడానికి వింతగా ఉన్న ఇదీ నిజం.. జగదీశ్ కోతికి భయపడి బయటకు రావడం లేదు. ఎక్కడ వచ్చి తనపై దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నాడు. అటవీ అధికారులు ఆ కోతిని తీసుకెళ్లినా.. జగదీశ్ భయం మాత్రం తగ్గడం లేదు.

English summary
a monkey Revenge man jagadish. he help to forest officers for caught a monkey. incident happened at karnataka chikmagalur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X