• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్ వీడియో: చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన కోతి..చెయ్యి పట్టుకుని ఈడ్చుకుంటూ..

|

న్యూఢిల్లీ: సాధారణంగా కోతులు మన చేతుల్లో ఉన్న ఆహార పొట్లాలనో, పండ్లనో లేక కొబ్బరి చిప్పలనో లాక్కెళ్లిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో అదిలిస్తే పారిపోతుంటాయి అవి. ఓ కోతి మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించింది. ఏకంగా ఓ చిన్నారిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించింది. దీనికోసం తీవ్రంగా శ్రమించింది. ఎంత తీవ్రంగా అంటే.. పక్కనున్న వాళ్లు అదిలిస్తున్నప్పటికీ.. బెదరనంతగా. ఆ చిన్నారి చెయ్యి పట్టుకుని సుమారు 20 అడుగుల దూరం వరకూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది.

దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడ తీసిందో తెలియట్లేదు గానీ..మన దేశంలోనేననేది స్పష్టమౌతోంది. సుశాంత నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన పట్ల నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా లాక్‌డౌన్‌తో ముడిపెడుతున్నారు. లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే.. ఇలాంటి అనర్థాలే చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానిస్తున్నారు.

 Monkey running along with a toddler lets go after being a man intervention
  Viral Video : Indian Border Police Dress Up As Bears To Scare Away Monkeys In Uttarakhand

  ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో చోటు చేసుకున్న ఘటన ఇది. అపార్ట్‌మెంట్ల మధ్య ఉండే ఖాళీ స్థలంలో ముగ్గురితో పాటు కలిసి కూర్చుని ఉన్న ఆ చిన్నారిని.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ కోతి లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. అపార్ట్‌మెంట్ మెయిన్ గేటు నుంచి లోనికి ప్రవేశించిన ఆ కోతి.. నేరుగా ఆ చిన్నారి వద్దకే వెళ్లింది. పక్కన మరికొందరు ఉన్నప్పటికీ.. పట్టించుకోలేదు. నేరుగా ఆ చిన్నారి వద్దకు వెళ్లింది. చెయ్యి పట్టుకుని వెనక్కి లాగింది. దీనితో ఆ చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ.. కింద పడింది.

  అదే ఊపుతో ఆమెను కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లింది. ఒకసారి చెయ్యి వదులైనా.. కోతి మాత్రం పట్టు వదల్లేదు. రెండోసారి కూడా చెయ్యి పట్టుకుని మరింత దూరం లాక్కెళ్లిందా కోతి. అదే సమయంలో వెనుక వైపు నుంచి ఓ వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ రావడంతో వదిలేసి పరుగులు తీసింది. ఈ దృశ్యాలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఓ సాధారణ కోతి.. చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం పట్ల విస్తుపోవాల్సి వస్తోందని సుశాంత నందా వ్యాఖ్యానించారు. ఇలాంటి అరుదైన సంఘటనల మధ్య తాము జీవిస్తున్నామని కామెంట్స్ చేశారు.

  English summary
  A video shared by a Sports, a monkey running in a small by-lane and grabbing a baby girl sitting on the side way. In a frenzy the monkey grabs and drags the baby for a short distance and lets go after being chased by a man. The toddler though not badly hurt, manages to stand up and walks back. The time and place of the incident is not known.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more