వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోతి ఎంత పని చేసింది, కరోనా రోగి రక్త నమూనాలను ఎత్తుకెళ్లి చెట్టేక్కి కూర్చొంది, ఆందోళన చెందొద్దట...

|
Google Oneindia TeluguNews

ఎప్పుడు ఎక్కడ ఎవరినుంచి ఎలా వస్తుందో తెలియడం లేదు. కరోనా పేరు చెబితేనే జనం కంగారుపడుతున్నారు. అలాంటిది కరోనా వైరస్ లక్షణాలు ఉన్న రోగి రక్త నమూనాలను కోతి తీసుకెళ్లింది. వాటితో సర్జికల్ గ్లౌజ్ కూడా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ చేతి నుంచి తీసుకెళ్లడంతో.. సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే అది రోజువారీ చేసే రక్తం అని, కోవిడ్ పరీక్షల కోసం తీసింది కాదు అని.. మనుషుల నుంచి కోతులకు వైరస్ సోకదని కొత్త భాష్యం చెబుతున్నారు అక్కడి వైద్యులు.

Recommended Video

Monkeys Run Away With COVID-19 Test Samples In Uttar Pradesh
రెప్పపాటులో..

రెప్పపాటులో..


పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గల మీరట్ మెడికల్ కాలేజీ వద్ద జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. మెడికల్ కాలేజీలో కరోనా వైరస్ రోగుల చికిత్స అందిస్తోన్న నోడల్ కేంద్రంగా ఉంది. ఇక్కడే ల్యాబ్ కూడా ఉంది. అయితే మూడురోజుల క్రితం ల్యాబ్ టెక్నీషియన్ రక్తనమూనాలను తీసుకొని వస్తోండగా.. కోతి వచ్చింది. అతని చేతిలో ఉన్న బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అక్కడినుంచి ఉడాయించింది. తర్వాత పక్కనే గల చెట్టుమీదకి ఎక్కింది. అందులో ఉన్న సర్జికల్ గ్లైవ్ తినేందుకు ప్రయత్నించింది.

కోతి తీసుకెళ్లింది నిజమే

కోతి తీసుకెళ్లింది నిజమే


దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఘటనపై మీడియా వివరణ అడగగా ఆస్పత్రి యజమాన్యం నిజమేనని అంగీకరించింది. కానీ ఆ శాంపిల్స్ కరోనా వైరస్ సోకిన వ్యక్తికి సంబంధించి నమూనాలు కావు అని.. ప్రతీరోజు చేసే రక్త పరీక్షలకు సంబంధించి బ్లడ్ అని తెలిపారు. రోజువారీగా రోగులకు చేసే రక్త నమూనాలు మాత్రమే అని.. రోగుల నుంచి మరోసారి రక్త నమూనాలు కలెక్ట్ చేశామని మీరట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్కే గార్గ్ తెలిపారు.

మనుషుల నుంచి కోతులకు..?

మనుషుల నుంచి కోతులకు..?

వైరస్ సోకిన వారి బ్లడ్ శాంపిల్స్ చల్లని ప్రదేశంలో ఉంచుతామని చెప్పారు. ఇలా బహిరంగ ప్రదేశంలో ఉంచమని పేర్కొన్నారు. కోతి ఎత్తుకెళ్లిన నమూనాలతో వైరస్ వ్యాపించదని.. ప్రజలు భయపడొద్దని సూచించారు అంతేకాదు మానవుల నుంచి కోతులకు వైరస్ సోకుతుందని ఇప్పటివరకు ఏ అధ్యయనం నిరూపించలేదని ఆయన తెలిపారు. ప్రపంచంలో చాలా తక్కువ జంతువులతో కరోనా వైరస్ వస్తోందని అమెరికా సెంటర్స్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

English summary
monkey attacked a lab technician, snatched vials containing blood samples from three coronavirus patients and escaped
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X