వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుతుపవనాలతో సాధారణ వర్షపాతమే కానీ, ఆ 2 నెలల్లో భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోనూ..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో ఈ ఏడాది రుతుపవనాలతో వర్షాలు సాధారణ స్థాయిలో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, జూన్, జులై కాలంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అత్యధిక వర్షాపాతం నమోదు కానుందని అంచనా వేసింది.

పలు రాష్ట్రాల్లో వర్షపాతం ఇలా..

పలు రాష్ట్రాల్లో వర్షపాతం ఇలా..

మరో నెల రోజుల్లో వచ్చే రుతుపవనాల కారణంగా ఒడిశా, పశ్చిమబెంగాల్, మిజోరాం రాష్ట్రాల తీరప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుంది. అయితే, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

జూన్, జులైలో సాధారణమే కానీ..

జూన్, జులైలో సాధారణమే కానీ..

దేశ వ్యాప్తంగా 40-50శాతం సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పశ్చిమ, మహారాష్ట్ర ఉత్తర ప్రాంతాల్లో 50-60శాతం వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. ఇక నైరుతి రుతుపవనాల కారణంగా మే చివరి వారం నుంచి లేదా జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, దేశ వ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

Recommended Video

AP Rainfall : Drastic Changes In Weather, Cyclone Alert
ఏపీ, తెలంగాణలోనూ..

ఏపీ, తెలంగాణలోనూ..

డబ్ల్యూఎం ఆధ్వర్యంలోని పలు సంస్థలతోపాటు ది సౌత్ ఏషియా సీజనల్ క్లైమెట్ ఔట్ లుక్ ఫోరమ్(ఎస్ఏఎస్‌సీఓఎఫ్) కూడా దాదాపు భారత వాతావరణ శాఖ తెలిపిన అంచనాలనే వెల్లడించాయి. జూన్, జులై మాసాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలోని మరట్వాడా, విధర్భ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

English summary
India is forecast to get an overall ‘normal’ monsoon rainfall this year, but an initial month-wise prediction suggests ‘below normal’ rainfall during June, long dry spells in July and the rains then making up with ‘excess rainfall’ during August and September — almost similar to last year’s pattern, says an internal assessment note available with the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X