వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్స్: గుజరాత్‌లో భారీ వర్షాలు, తెలంగాణ-కోస్తాంధ్రలోనూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కొంకణ్, గోవాలలోని పలు ప్రాంతాలలోను కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Recommended Video

మహారాష్ట్రకు రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

తూర్పు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, సౌరాష్ట్ర, మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తా కర్ణాటక, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ తదితర రాష్టారలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Monsoon update: heavy rain at isolated places very likely over Gujarat region

ఉత్తరాఖండ్, వెస్ట్ మధ్యప్రదేశ్, విదర్భ, కోస్తాంధ్రప్రదేశ్, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడులలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం నార్త్ వెస్ట్ బంగాళాఖాతం మీదుగా, పరిసర ప్రాంతాలలో అల్ప పీడనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం, ఆ పరిసర ప్రాంతాలలో 19 జూలైన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రాబోయే ఐదారు రోజుల్లో రుతుపవనాల ప్రభావం ఇలాగే కొనసాగుతుంది.

గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద చినుకులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తరాఖండ్, ఈస్ట్ రాజస్థాన్, కొంకణ్, గోవా, సౌరాష్ట్ర, కచ్, మధ్య మహారాష్ట్ర, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, వెస్ట్ రాజస్థాన్, తూర్పు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, సబ్ హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, కేరళ, ఇంటీరియర్ తమిళనాడులలో భారీ వర్షాలు కురవనున్నాయి.

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

English summary
Heavy to very heavy rain with extremely heavy falls at isolated places very likely over Gujarat region on Saturday, according to Indian Meteorological Department (IMD) weather bulletin. Heavy rain at a few places with very heavy rain at isolated places very likely over Konkan and Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X