వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్స్: ఈశాన్య రాష్ట్రాలలో వర్షాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా చెదురుముదురు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌లలోని పలు ప్రాంతాలలో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.

Recommended Video

ఏపీ-తెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం విస్తరించే అవకాశముంది. ప్రస్తుత మాన్సూన్ పరిస్థితులు దక్షిణాదిన, సెంట్రల్ ఇండియాలో మరో 45 రోజుల పాటు కొనసాగే అవకాశముంది.

Monsoon update: Heavy rain likely in Goa, Himachal Pradesh, Uttarakhand and Coastal Karnataka

నేటి నుంచి నార్త్ వెస్ట్ ఇండియాలో వర్షాలు మరిన్ని కురిసే అవకాశాలు ఉన్నాయి. అరేబియా సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి రానున్న నాలుగు రోజుల్లో ఉండే అవకాశముంది.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు ఈ మాన్సూన్‌లో కొంకణ్, గోవాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. వెస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ గుజరాత్ ప్రాంతాలలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కోస్టల్ కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, సౌరాష్ట్ర, ఉత్తరాఖండ్, ఈస్ట్ రాజస్థాన్, ఈస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, ఈస్ట్ రాజస్థాన్, ఈస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒడిశాలోని పలు ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, మధ్య మహారాష్ట్ర, విదర్భలలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

English summary
The northeastern states have been recording hefty showers for the past few days. However, we saw rains occurring during the past day as Assam, Arunachal Pradesh, Nagaland, and Manipur recorded light to moderate rain with isolated heavy spells only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X