వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్స్: బంగాళాఖాతం వైపు రుతుపవనాలు, మత్స్యకారులకు హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రుతువనాలు క్రమంగా ఉత్తరాది వైపు పయనిస్తున్నాయి. కపుర్తాలా, షాజాపూర్, వారణాసి, పుర్నియా, డిఘా మీదుగా బంగాళాఖాతం వైపు కదులుతున్నాయి.

బంగాళాఖాతం వాయువ్య తీర ప్రాంతం, సమీప ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీర్ల ఎత్తున సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంటుంది. కపుర్తాలా, షాజాపూర్, నహన్, నజీబాబాద్, షాహజాన్‌పుర, వారణాసి, పుర్నియా, డిఘా మీదుగా రుతుపవనాలు సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండనున్నాయి. దీంతో బంగాళాఖాతం, సమీప ప్రాంతాల్లో తక్కువ పీడనంతో కదులుతాయి.

రుతుపవనాలు రానున్న 34 రోజుల్లో మళ్లీ బలపడే అవకాశాలున్నాయి. దక్షిణాదిన, సెంట్రల్ ఇండియాలో రానున్న మూడు రోజుల్లో బలమైన రుతుపవనాల ప్రభావం కనిపించనుంది. సెంట్రల్ ఇండియాలోని మిగతా ప్రాంతాలు, ఉత్తరాది ప్రాంతంలో, నార్త్ వెస్ట్ ఇండియాలో జూలై 10వ తేదీ నుంచి వర్షపాతం మెరుగ్గా ఉండే అవకాశముంది.

Monsoon update: Heavy rain likely over Konkan, Goa and Coastal Karnataka

సెంట్రల్ అరేబియా సముద్రం ప్రాంతంలో రానున్న 34 రోజుల్లో కల్లోలంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.

ఈ మాన్సూన్‌లో వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం కొంకణ్, గోవాలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కోస్టల్ కర్ణాటక, మహారాష్ట్ర, విదర్భలలో భారీ వర్షాలు, కేరళ, తెలంగాణ, గుజరాత్, మధ్య మహారాష్ట్రలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఒడిశా, సబ్ హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

English summary
The western arm of the Monsoon trough has further shifted slightly northwards and is moving across Kapurthala, Nahan, Shajapur, Varanasi, Purnea, Digha and towards Bay of Bengal across the low-pressure area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X