వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్స్: కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, సౌత్ గుజరాత్‌లలో భారీ వర్షాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రుతుపవనాలు బంగాళాఖాతం వైపు చురుగ్గా కదులుతున్నాయి. శ్రీగంగానగర్, అల్వార్, నార్నాల్, శివపురి, ఉమారియా, పెండ్ర, జర్సుగుడ, పూరీ మీదుగా ఈస్ట్ సెంట్రల్ బంగాళాఖాతం వైపు కదులుతున్నాయి.

Recommended Video

ఏపీ-తెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

గత 24 గంటలుగా కొంకణ్, గోవా, ముంబై, దక్షిణ గుజరాత్‌లపై రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. కోస్టల్ కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, విదర్భలోని పలు ప్రాంతాలు, జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌‌లపై కూడా రుతుపవనాల ప్రభావం కనిపించింది.

Monsoon update: Heavy rain likely over Konkan, Goa, Madhya Pradesh and south Gujarat

రానున్న 56 రోజుల్లో దక్షిణాదిలో, సెంట్రల్ ఇండియాలో రుతు పవనాలు విస్తరించే అవకాశముంది. రానున్న 24 గంటలలో నార్త్ వెస్ట్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం పెరిగే అవకాశముంది. రానున్న 34 రోజుల్లో నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య భారతంలో వర్షం కురిసే అవకాశాలున్నాయి.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు ఈ మాన్సూన్‌లో కొంకణ్, గోవాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. వెస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ గుజరాత్ ప్రాంతాలలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కోస్టల్ కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, సౌరాష్ట్ర, ఉత్తరాఖండ్, ఈస్ట్ రాజస్థాన్, ఈస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, ఈస్ట్ రాజస్థాన్, ఈస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒడిశాలోని పలు ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, మధ్య మహారాష్ట్ర, విదర్భలలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

English summary
The axis of monsoon trough continues to pass through Sri Ganganagar, Alwar, Narnaul, Shivpuri, Umaria, Pendra, Jharsuguda, Puri and then towards East-central Bay of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X