వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్: సిక్కిం, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బలహీన రుతుపవనాలు కొనసాగుతున్నాయి. ఎంజేవో కదలికలు, ఉత్తర బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులను బట్టి జూన్ 24వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, చత్తిస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా తదితర ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, మిగిలిన సెంట్రల్ అరేబియన్ సముద్రంలో విస్తరించనున్నాయి. వల్సాద్, మాలెగావ్, అమరావతి, గోండియా, తిత్లాఘర్, కటక్, మిడ్నాపూర్, గోల్పారా, బాగ్డోగ్రాల మీదుగా నార్తర్న్ లిమిట్ ఆప్ మాన్సూన్స్ విస్తరించనున్నాయి.

Monsoon update: Heavy rain likely over West Bengal, Sikkim

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మిగిలిన మహారాష్ట్ర, అసోం, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, చత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దక్షిణ సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముంది.

Monsoon update: Heavy rain likely over West Bengal, Sikkim

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

English summary
Weak Monsoon conditions are still prevailing over most parts of the country. Due to the favourable movement of MJO and the formation of a weather system over North Bay of Bengal, we expect Monsoon to advance further around June 24 over parts of West Bengal, Madhya Pradesh, some more parts of Chhattisgarh and Odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X