వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెదర్ రిపోర్ట్: కర్ణాటక, కేరళ తీరాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో సాధరణం కంటే తక్కువ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు థానే(ముంబైని కలుపుకుని) అహ్మద్ నగర్, బుల్ధానా, అమరావతి, గోండియా, టిట్లగఢ్, కటక్, మిడ్నాపూర్, గోవల్పర, బఘ్డోగ్రా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. రుతుపవనాలు బలహీన పడిన కారణంగా వచ్చే వారం కూడా దీని ప్రభావం తక్కువగానే ఉండనుంది.

Monsoon Update: Heavy to very heavy rain at isolated places very likely over coastal Ktaka, Kerala

భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) శనివారం విడుదల చేసిన అంచనాల ప్రకారం..
కర్ణాటక, కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, కొంకణ్, గోవా, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో దుమ్ముధూళితో కూడిన గాలులు వీయనున్నాయి.

Monsoon Update: Heavy to very heavy rain at isolated places very likely over coastal Ktaka, Kerala

అస్సాం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక తీర ప్రాంతాల్లో రాబోయే 24గంటల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ డివిజన్‌లో, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఈదురుగాలుల వీస్తాయి.

ఐఎండీ అంచనాల ప్రకారం.. మధ్య భారతదేశంలో సాధారణ వర్షం నమోదు కానుంది. దక్షిణ పెనిసుల- కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదు కానుంది.ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

Monsoon Update: Heavy to very heavy rain at isolated places very likely over coastal Ktaka, Kerala

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.
English summary
The Northern Limit of Monsoon (NLM) continues to pass through Thane (including Mumbai), Ahmednagar, Buldhana, Amravati, Gondia, Titlagarh, Cuttack, Midnapore, Goalpara, Baghdogra. Further advance of southwest monsoon is not likely during next one weak due to the likely prevalence of weak monsoon pattern.
Read in English:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X