వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్స్: ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలలో భారీ వర్షాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ రోజు (26 జూలై) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, జమ్ము కాశ్మీర్, పంజాబ్, ఈస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లోని గాగ్నెటిక్ ప్రాంతం, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, కొంకణ్, తమిళనాడు, కోస్టల్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళలోను భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.

రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, చత్తీస్ గఢ్, ఢిల్లీ, ఈస్ట్ రాజస్థాన్, వెస్ట్ మధ్యప్రదేశ్, కోస్ల్, సౌత్ ఇండీరియర్ కర్ణాటకలలోను జూలై 27న పలు ప్రాంతాల్లో భారీ, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం పడే అవకాశముందని తెలిపింది.

Monsoon Updates: Heavy rain in Uttara Pradesh and Delhi

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

Recommended Video

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లలో సాధారణం కంటే తక్కువ నమోదు కానుంది.
Monsoon Updates: Heavy rain in Uttara Pradesh and Delhi

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

English summary
Heavy to very heavy rain at isolated places very likely over Uttarakhand, Uttar Pradesh, and Haryana, Chandigarh & Delhi; heavy rain at isolated places over  Himachal Pradesh, Jammu & Kashmir,Punjab,   East   Rajasthan,   Madhya   Pradesh,   Assam   &   Meghalaya,   Nagaland,   Manipur,   Mizoram   &   Tripura, Gangetic West Bengal, Chhattisgarh, Jharkhand, Konkan,Tamilnadu, Coastal & South Interior Karnataka andKerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X