వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్స్: ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్‌లలో భారీ వర్షాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అల్పపీడనం మధ్య ఉత్తర ప్రదేశ్‌కు వ్యాపించింది. దీంతో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, నార్త్ వెస్ట్ మధ్యప్రదేశ్‌లలో రానున్న రెండు రోజుల్లో విస్తృతస్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

వెస్ట్ ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. పంజాబ్, ఈస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో రానున్న రెండు రోజుల్లో విస్తృతస్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Monsoon Updates: heavy to very heavy rainfall over Uttar Pradesh, Haryana and Delhi

వెస్ట్ బెంగాల్లోని ఈస్టర్న్ పార్ట్స్, పరిసర ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. జూలై 28వ తేదీ నుంచి ఈశాన్య రాష్ట్రాలలో వర్షపాతం పెరిగే అవకాశముంది.

హిమాచల్ ప్రదేశ్‌లో ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు భారీ వర్షం కురిసే అవకాశముంది.

Recommended Video

ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

English summary
The low pressure area lies over central parts of Uttar Pradesh. This system is likely to remain quasi stationary and thereby cause widespreadrainfall with isolated heavy to very heavy  rainfall over  Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh, Haryana, Chandigarh & Delhi and NorthwestMadhya Pradesh during next 2 days.
Read in English: Widespread rains expected
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X