వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్స్: సెంట్రల్ ఇండియా వైపు నైరుతి రుతుపవనాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఉత్తరాది వైపు కదులుతున్న రుతుపవనాలు

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఉత్తరాది వైపు కదులుతున్నాయని, ఆ తర్వాత సెంట్రల్ ఇండియాకు వ్యాపిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, చత్తీస్‌గఢ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, దక్షిణ గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ప్రవేశించనున్నాయి.

ఈ నెల 24వ తేదీ నుంచి మాన్సూన్ సర్క్యులేషన్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్ము కాశ్మీర్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అసోం, మేఘాలయ, కోస్తాంధ్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, మధ్య మహారాష్ట్ర, ఒడిశా తదితర ప్రాంతాలలో తుఫాను అవకాశాలున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటల నుంచి 17.30 గంటల మధ్య కురవనుంది.

Monsoon updates: SW monsoon advances towards central India

తూర్పు భారత్‌లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. కాగా, గురువారం దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం మేఘావృతంగా కనిపించింది. ఇక్కడ మినిమమ్ టెంపరేచర్ 30.9 డిగ్రీస్ సెల్సియస్‌గా నమోదయింది.

Monsoon updates: SW monsoon advances towards central India

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

Monsoon updates: SW monsoon advances towards central India

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

English summary
The Southwestern Monsoon continues to advance northwards and would soon cover central India, IMD bulletin said. Conditions have become favourable for further advance of Southwest Monsoon over remaining parts of Assam, some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, West Bengal and some parts of South Gujarat region, Jharkhand, Bihar and Madhya Pradesh between 23rd to 25th June.
Read in English: SW monsoon advances
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X