వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్స్: ఉత్తరాదిన చురుగ్గా రుతుపవనాలు, 24 గంటల్లో ఢిల్లీని తాకే ఛాన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రానున్న 24 గంటల్లో నార్త్ వెస్టర్న్ ఇండియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతీ రుతుపవనాల పురోగతి పరిస్థితి అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Recommended Video

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లలో సాధారణం కంటే తక్కువ నమోదు కానుంది.

హర్యానాలోని పలు ప్రాంతాలతో పాటు చత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఈస్ట్ రాజస్థాన్, ఈస్ట్ ఉత్తర ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన చిరుజల్లులు పడే అవకాశముందని తెలిపింది. ఢిల్లీపై రుతుపవనాల ప్రభావం గురించి చెప్పాల్సి ఉంది.

Monsoon updates: SW Monsoon reaches North India, likely to hit Delhi in next 24 hours

గుజరాత్‌లోని పలు ప్రాంతాలు, ఈస్ట్ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మొత్తం, ఉత్తర ప్రదేశ్‌లపై నైరుతీ రుతుపవనాల ప్రభావం ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలతో పాటు జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలు, వెస్ట్ ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండగఢ్, ఢిల్లీపై రానున్న 48 గంటల్లో రుతుపవనాలు వ్యాపించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Monsoon updates: SW Monsoon reaches North India, likely to hit Delhi in next 24 hours

ముంబైలో ఆది, సోమవారాలు భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం సంభవించింది. ఈ వర్షం కారణంగా శాంటాక్రాజ్ ప్రాంతంలో ఈ ఏడాదిలోనే మొదటిసారి ఎక్కువ వర్షపాతం (231.4 మి.మీ.) నమోదయింది.

మంగళవారం కోల్‌కతాలోను భారీ వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) భారీ వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 29 నాటికి ఢిల్లీకి రుతుపవనాలు ప్రవేశించాలి.

Monsoon updates: SW Monsoon reaches North India, likely to hit Delhi in next 24 hours

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.

దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.

English summary
The Indian Meteorological Department (IMD) has predicted heavy to very heavy rains and possible thunderstorm activity for the northwestern parts of India in the next 24 hours. The weather body also said the conditions are favourable for the advancement of Southwest monsoon.
Read in English: Monsoon reaches North India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X