వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సూన్ అప్‌డేట్: రాజస్థాన్, ఎంపీ, గుజరాత్, కేరళలో అతి భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.

Recommended Video

ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు

ఉత్తరాఖండ్, హర్యానా, ఛండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులు, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Monsoon updates: Very heavy rains at isolated places very likely over East Rajasthan and West MP

అండమాన్ నికోబార్ దీవులపై గంటకు 35-45కి.మీ వేగంతో విపరీతమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

Monsoon updates: Very heavy rains at isolated places very likely over East Rajasthan and West MP

తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆగ్నేయం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం ఉంది. దక్షిణ గుజరాత్‌లో అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Monsoon updates: Very heavy rains at isolated places very likely over East Rajasthan and West MP

అల్పపీడనం, తుఫానుల కారణంగా రానున్న 48గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జులై 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

English summary
Heavy rain at a few places with very heavy falls at isolated places very likely over East Rajasthan and West Madhya Pradesh, according to India Meteorological Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X