వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధ్వంసమైన చోటే ఆరడుగుల విగ్రహం .. నెలరోజుల తర్వాత ఆవిష్కరణ ...

|
Google Oneindia TeluguNews

కోల్‌కత : సార్వత్రిక ఎన్నికల వేళ కోల్‌కతా అమిత్ షా తీసిన ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యాసాగర్ కాలేజీలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాం ధ్వంసమైంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి .. నెలరోజుల తర్వాత అదేచోట విగ్రహాం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంది బెంగాల్ సర్కార్. అక్కడే విగ్రహాం ఏర్పాటుచేస్తామని ఇదివరకే మమత బెనర్జీ పేర్కొన్న సంగతి తెలసిందే.

నెలరోజుల తర్వాత ..
గతనెల 14న కోల్‌కతాలో అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య హింస చెలరేగింది. రోడ్ షో సమయంలో విద్యాసాగర్ కాలేజీలో ఉన్న ప్రముఖ సామాజికవేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి బెంగాల్ సంప్రాదాయాలను అవమానించారని టీఎంసీ దాడిచేసింది. అంతేకాదు బెంగాల్‌లోకి స్థానికేతరులను తీసుకొచ్చి గొడవ సృష్టించారని విమర్శించారు. దీనిపై బీజేపీ కూడా ప్రతిగా కౌంటర్ అటాక్ చేసింది. విగ్రహాం ధ్వంసమైన చోట నెలకొల్పుతామని మమత బెనర్జీతోపాటు ప్రధాని మోడీకి హామీనిచ్చారు. ఎన్నికల సమయంలో బహిరంగ సభలో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Month after vandalism, Mamata Banerjee to unveil Vidyasagar bust at Kolkata college

6 అడుగుల విగ్రహం ..
విద్యాసాగర్ కాలేజీలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాం ఉన్న చోట విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ధ్వంసమైన సరిగ్గా నెలరోజులకు అంటే మే 14న దాడి జరుగగా .. ఇవాళ ఆవిష్కరించేందుకు బెంగాల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 6 అడుగులు ఉన్న విద్యాసాగర్ విగ్రహం ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. విగ్రహాన్ని ఆవిష్కరించాక .. మమతా బెనర్జీ ప్రసంగిస్తారు. విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్, ఇతర ప్రముఖులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బెంగాల్‌లో స్థానికేతరులు వచ్చి దాడి చేశారని .. బీజేపీపై విమర్శల జడివానను మమత కొనసాగించే అవకాశం ఉంది.

English summary
The stage is all set for the unveiling of a new bust of Ishwarchandra Vidyasagar in Kolkata's Vidyasagar College. Bengal Chief Minister Mamata Banerjee will formally unveil the bust over a month after it was vandalised during BJP president Amit Shah's roadshow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X