• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న ‘మే’, నిపుణుల సూచనిలివే..

|

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ రెట్టింపయ్యే వ్యవధి మాత్రం తగ్గుతూ రావడం శుభసూచకం. కరోనా కట్టడి కోసం ఇప్పటి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించి విషయం తెలిసిందే. అయితే, మే 3 తర్వాత పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?

మే 3 తర్వాత నుంచే కీలకం..

మే 3 తర్వాత నుంచే కీలకం..

మే 3 తర్వాత కూడా కరోనా వ్యాప్తి కట్టడి కోసం తీసుకునే చర్యలే ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. మే నెలలో కరోనా కేసులు మరింతగా తగ్గితే ఇక మనదేశం నుంచి ఆ మహమ్మారిని తరిమే అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. లేదంటే కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేది వర్షా కాలం కావడంతో మే నెల ఇప్పుడు కరోనా వ్యాప్తికి, కట్టడికి కీలకంగా మారనుంది.

వాటన్నంటినీ మే నెల మొత్తం..

వాటన్నంటినీ మే నెల మొత్తం..

కాగా, కరోనా హాట్‌స్పాట్స్, రెడ్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలను కొనసాగిస్తూ గ్రీన్ జోన్లలో సడలింపులను ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ప్రాథమికంగా సూచనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, రైళ్లు, విమానాలు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించవద్దని, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, మత సంబంధ స్థలాలు, ఇతర జన సమూహాలు చేరుకునే ప్రాంతాలను మే నెల మొత్తం మూసివేసే ఉంచాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రధాని సూచనలు కూడా అంతే..

ప్రధాని సూచనలు కూడా అంతే..

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకుంటూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చిన కేంద్రం.. కరోనా రహిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో మాత్రం సడలింపులను అనుమతిచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

కరోనా అంతమా? వ్యాప్తా?

కరోనా అంతమా? వ్యాప్తా?

ప్రస్తుతం దేశం కరోనా హాట్‌స్పాట్ జిల్లాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటి వరకు 170 జిల్లాలు ఉండగా ఇప్పుడు 129కి తగ్గాయి. అయితే ఇదే సమయంలో గ్రీన్ జోన్లు కూడా 325 నుంచి 307కు తగ్గగడం గమనార్హం. ఇక రెడ్ జోన్లు 207 నుంచి 297కు పెరిగాయి. నోయిడా పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్, ఫర్టీస్ అడిషనల్ డైరెక్టర్ డా. రాజేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కరోనా అంతం చేయకపోయినప్పుడు వ్యాప్తిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

లాక్ డౌన్ కొనసాగింపే మేలు.. కానీ..

లాక్ డౌన్ కొనసాగింపే మేలు.. కానీ..

కరోనా రెడ్ జోన్లలో లాక్ డౌన్ మరో రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగిస్తే మంచి ఫలితాలు ఆశించవచ్చని గుప్తా చెప్పారు. అయితే, గ్రీన్ జోన్ల మాత్రం సడలింపులు ఇవ్వవచ్చని తెలిపారు. అయితే, రెడ్ జోన్, గ్రీన్ జోన్ల మధ్య ఎలాంటి రాకపోకలు ఉండకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి లేదా తగ్గడానికి మే నెల చాలా కీలకమని డాక్టర్ రాజేష్ కుమార్ గుప్తా తెలిపారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించాల్సిందేనని చెప్పారు. కంటైన్మెంట్ స్ట్రాటజీని అమలు చేయాల్సిందేనని అన్నారు. మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇంటర్నల్ మెడిసిన్ అసోసియేట్ డైరెక్టర్ డా. రమమెల్ టిక్కూ మాట్లాడుతూ.. మరో నెలపాటు లాక్‌డౌన్ కొనసాగిస్తే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. వచ్చేది వర్షాకాలం కావడంతో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే మే నెలలో కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

English summary
As the May 3 deadline for the lockdown nears, medical experts feel the next month can be "make or break" for the fight against Covid-19 and an aggressive containment strategy for hotspots along with insulation of green zones is essential while giving some relaxations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more