వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: మళ్లీ ప్రధానిగా మోడీనే, ఎన్డీఏకు 321 సీట్లు, కరోనాపై పోరు భేష్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏ కూటమికి 321 సీట్లు వస్తాయని తేల్చింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అధికారం చేపడతారని తెలిపింది.

ఎన్డీఏకు 321 సీట్లు.. యూపీఏకి 93 సీట్లు

ఎన్డీఏకు 321 సీట్లు.. యూపీఏకి 93 సీట్లు

కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్న విధానం, కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న పరిణామాలపై దేశ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దేశ ప్రజలు మరోసారి ఎన్డీఏ వైపే మొగ్గుచూపుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్లయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 321 లోక్‌సభ స్థానాలు, యూపీఏకి 93, ఇతరులకు 129 స్థానాలు దక్కుతాయని తేల్చింది.

ఓట్ షేర్ విషయంలోనూ సత్తా చాటిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ

ఓట్ షేర్ విషయంలోనూ సత్తా చాటిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ

ఇక ఓట్ షేర్ విషయానికొస్తే.. ఎన్డీఏకు 43 శాతం ఓట్లు రాగా, యూపీఏకు 27 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులకు 30 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం విజయవంతమైందని మెజార్టీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొందని స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారిని నరేంద్ర మోడీ సమర్థంగా ఎదుర్కొన్నారు.

కరోనా మహమ్మారిని నరేంద్ర మోడీ సమర్థంగా ఎదుర్కొన్నారు.

కరోనా మహమ్మారిని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సమర్థవంతంగా ఎదుర్కొందని సగం కంటే ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.

జనవరి 2021 వరకు
అద్భుతంగా పనిచేశారు: 23 శాతం మంది
బాగా పనిచేశారు: 50 శాతం
సగటుగా పనిచేశారు: 18 శాతం
బాగా చేయలేదు: 7 శాతం
సమాధానమివ్వనివారు 2 శాతం మంది.

ఆగస్టు 2020 వరకు
అద్భుతంగా పనిచేశారు: 29 శాతం
బాగా పనిచేశారు: 48 శాతం
సగటుగా చేశారు: 18 శాతం
బాగా చేయలేదు: 5 శాతం

మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌ను మార్కెట్ పరిశోధన సంస్థ కార్వీ ఇన్‌సైట్స్ నిర్వహించింది. ఈ పోల్ జనవరి 3, 2021 మరియు జనవరి 13, 2021 మధ్య జరిగింది.

మొత్తం 12,232 ఇంటర్వ్యూలు జరిగాయి - గ్రామీణంలో 67 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33 శాతం - 97 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 19 రాష్ట్రాల్లోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి.

English summary
Mood of The Nation 2021: NDA likely to win 321 seats if polls are held today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X