వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే సందడి: విపక్షాల నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రజల ఎవరివైపు మొగ్గు చూపారంటే..?

|
Google Oneindia TeluguNews

విపక్షాల నుంచి దేశ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారో అనే ఛాయిస్ భారతీయులకు ఇస్తే వారు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలుసా..? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్వేల సందడి మొదలైంది. ముఖ్యంగా జాతీయ మీడియా ఛానెళ్ల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని వారు ప్రజలముందుకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే దేశ ప్రధానిపై మరో ఆసక్తికర విషయం వెల్లడైంది.

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ప్రముఖ జాతీయ మీడియా సర్వే

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ప్రముఖ జాతీయ మీడియా సర్వే

ఎన్నికల వేళ ప్రతి చిన్న అంశం ఆసక్తిని కలిగిస్తోంది. సర్వేల సందడి ప్రారంభమైన నేపథ్యంలో చాలామంది ఈ సర్వేల ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. తాజాగా విపక్షాల నుంచి తదుపరి దేశ ప్రధానిగా ఎవరుంటే బాగుంటుందన్న చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే ప్రముఖ జాతీయ ఛానెల్ ఇండియా టుడే కార్వే ఇన్‌సైట్స్‌తో కలిపి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో దేశ తదుపరి ప్రధానిపై ప్రజలను అడిగింది. దీంతో బీజేపీకి షాక్ ఇచ్చేలా ప్రజల సమాధానం ఉంది.

 రాహుల్ గాంధీకి జై కొట్టిన ప్రజలు

రాహుల్ గాంధీకి జై కొట్టిన ప్రజలు

విపక్షాల నుంచి తదుపరి దేశ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే బాగుంటుందని సర్వేలో పాల్గొన్న 52శాతం మంది ప్రజలు తెలిపారు. నరేంద్ర మోడీ కంటే రాహుల్ నాయకత్వమే బాగుంటుందని వారు తమ అభిప్రాయాన్ని తెలిపారు. మరో 46శాతం మంది ప్రధానిగా నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుందని అన్నారు. రాహుల్ గాంధీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం పేర్లను కూడా సర్వే సంస్థ ఆప్షన్స్‌లో ఉంచింది. రాహుల్ గాంధీకి ఎక్కువ మార్కులు పడగా ఆ తర్వాత ప్రధాని మంత్రిగా మమతా బెనర్జీకి మార్కులు పడ్డాయి. అయితే రాహుల్ గాంధీ మమతా బెనర్జీల పాపులారిటీల మధ్య 44 శాతం వ్యత్యాసం ఉంది.

 8శాతం మంది మాత్రమే మమత బెనర్జీ వైపు మొగ్గు

8శాతం మంది మాత్రమే మమత బెనర్జీ వైపు మొగ్గు

ఇదిలా ఉంటే కేవలం 8శాతం మంది మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా మమత బెనర్జీ వైపు మొగ్గారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ప్రధాని రేసుకు సరిపోరని ప్రజలు అభిప్రాయపడ్డారు. నాలుగు శాతం మంది మాత్రమే అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటువేయగా.. మాయావతికి 3శాతం, అఖిలేష్‌కు 5శాతం మంది మద్దతు తెలిపారు.

English summary
If Indians were given an option to choose their next prime minister from the opposition parties, Congress president Rahul Gandhi will be the most preferred choice to lead the country, reveals the Mood of the Nation poll conducted by India Today-Karvy Insights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X