వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: ఎన్డీయేకు 274, యూపీఏకు 164 సీట్లు, మోడీకి అక్కడ దెబ్బ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్‌డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే ఈ సర్వే ద్వారా మనకు కొంత అవగాహన రానుంది.

ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ-కాంగ్రెస్‌లకు ఏ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు వస్తాయి: ఏబీపీ సర్వే వివరాలు చదవండి.

Mood of the Nation Survey updates: In Rajasthan Cong to get 44 pc vote share and BJP, 39

Newest First Oldest First
9:25 PM, 24 May

ABP-CSDS సర్వే ప్రకారం భారత దేశం మొత్తంగా చూసుకుంటే ఎన్డీయే ఓట్ షేర్ 37 శాతం, యూపీఏ ఓట్ షేర్ 31 శాతం, ఇతరులు 32 శాతంగా ఉండనుంది.
9:25 PM, 24 May

ABP-CSDS సర్వే ప్రకారం సెంట్రల్-వెస్టర్న్ ఇండియాలో ఎన్డీయే 48 శాతం, యూపీఏ 43 శాతం, ఇతరులు 9 శాతం.
9:25 PM, 24 May

ABP-CSDS సర్వే ప్రకారం దక్షిణ భారత దేశంలో ఎన్డీయేకు 18 శాతం, యూపీఏకు 38 శాతం, ఇతరులకు 44 శాతం.
9:24 PM, 24 May

ABP-CSDS సర్వే ప్రకారం ఈశాన్య భారత దేశంలో ఎన్డీయే ఓట్ షేర్ 43 శాతం, యూపీఏ ఓట్ షేర్ 25 శాతం, ఇతరులు 32 శాతం.
9:24 PM, 24 May

ABP-CSDS సర్వే ప్రకారం ఉత్తర భారత దేశంలో ఎన్డీయే ఓట్ షేర్ 39 శాతం, యూపీఏ ఓట్ షేర్ 21 సాతం, ఇతరులు 40 శాతం
8:31 PM, 24 May

సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేదే గెలుపు అని తేలింది. బీజేపీకి సీట్లు తగ్గినా, గెలుపు మాత్రం ఎన్డీయేదే అని తేల్చింది. అదే సమయంలో యూపీఏ బాగా పుంజుకోనుంది. ఎన్డీయే 274 సీట్లు, యూపీఏ 164 సీట్లు, ఇతరులు 105 సీట్లు గెలుచుకుంటారని సర్వేలో వెల్లడైంది.
8:18 PM, 24 May

ఏబీపీ సర్వే ప్రకారం.. మోడీకి క్రేజ్ కాస్త తగ్గినా దేశంలో ఇప్పటికీ మోడీ పాపులారిటీయే ఎక్కువ. 2017లో మోడీ పాపులారిటీ 44 శాతంగా ఉండగా, 2018 జనవరిలో అది 37 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 34 శాతానికి పడిపోయింది. 2017 మేలో రాహుల్ గాంధీ పాపులారిటీ 15 శాతంగా ఉండగా, 2018 మే నాటికి 24 శాతానికి పెరిగింది.
7:51 PM, 24 May

ఏబీపీ న్యూస్ - సీఎస్‌డీఎస్ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ తగ్గినట్లుగా తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పాపులారిటీ కొంత పెరిగింది.
7:22 PM, 24 May

ఉత్తర భారత దేశంలో బీజేపీ గతంలో కంటే వెనుకబడింది. ఉత్తర ప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఆ పార్టీకి 2018 ఆరంభం నుంచి 8 శాతం ఓట్లు తగ్గాయని సర్వేలో వెల్లడైంది.
7:19 PM, 24 May

2019 లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ కంటే ఎస్పీ, బీఎస్పీ మిత్రపక్షాలు ఎక్కువ ఓట్లు, సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉంది. ఏబీపీ సర్వే ప్రకారం ఎస్పీ-బీఎస్పీలు కలిస్తే 53 శాతం ఓట్లను దక్కించుకోనున్నాయి. ఎన్డీయే 35 శాతం ఓట్లు, యూపీఏ 12 శాతం ఓట్లు దక్కించుకోనున్నాయి.
6:49 PM, 24 May

మధ్య భారతం, పశ్చిమ భారత దేశంలో 114 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 70 నుంచి 78 సీట్లు గెలుచుకోనుంది. 2014లో బీజేపీ ఇక్కడ 108 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ముప్పై సీట్ల వరకు తగ్గుతున్నాయి. 2014లో యూపీఏ 10 సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు 41 సీట్ల నుంచి 47 సీట్లు గెలుచుకోనుంది. ఇతరులు 2014లో ఏమీ గెలుచుకోలేదు. ఇప్పుడు 0-2 సీట్లు గెలుచుకోనున్నారు.
6:28 PM, 24 May

గుజరాత్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 54 శాతం ఓట్లు, యూపీఏకు 42 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ సర్వేలో వెల్లడైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 59 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 54 రానున్నాయి. అంటే 5 శాతం తగ్గనుంది. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 2014లో 33 శాతం రాగా, ఇప్పుడు 42 శాతం ఓట్లు రానున్నాయి. అంటే 9 శాతం పెరిగింది.
6:23 PM, 24 May

ఏబీపీ సర్వే ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీయేకు 48 శాతం, యూపీఏకు 40 శాతం, ఇతరులకు 12 శాతం ఓట్లు రానున్నాయని ఏబీపీ సర్వే తెలిపింది. 2014లో ఎన్డీయేకు 51 శాతం రాగా ఇప్పుడు 48 శాతం రానుంది. 3 శాతం ఓట్లు తగ్గనున్నాయి. అదే సమయంలో యూపీఏకు 2014లో 35 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 40 శాతం రానున్నాయి. ఐదు శాతం ఓట్లు ఎక్కువగా రానున్నాయి. శివసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేయనుంది. అయితే శివసేనతో కలిస్తే బీజేపీకి ఎంత లాభమంటే 2014లో 27 శాతం కాగా, ఇప్పుడు 29 శాతంగా ఉంది. రెండు శాతం ఎక్కువే ఉంది. కానీ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలున్నాయి.
5:48 PM, 24 May

ఈశాన్య ప్రాంతంలో బీజేపీ హవా.... ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపించనుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 142 స్థానాలు ఉండగా ఎన్డీయే 86 నుంచి 94 మధ్య, యూపీఏ 22 నుంచి 26 సీట్లు గెలుచుకోనుందని వెల్లడించింది. ఇతరులు 26 నుంచి 30 గెలవనున్నారు. 2018లో ఎన్డీయే 58, యూపీఏ 21, ఇతరులు 61 స్థానాలు దక్కించుకున్నారు.
5:46 PM, 24 May

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. యూపీఏ 11 శాతం ఓట్లు సాధించనుందని సర్వేలో వెల్లడైంది. 2014లో తృణమూల్ 73 శాతం, ఎన్డీయే 17 శాతం, యూపీఏ 10 శాతం సాధించింది. ఈ లెక్కన తృణమూల్‌కు కొంత ఓట్ షేర్ తగ్గనుంది.
5:45 PM, 24 May

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 65 శాతం ఓట్లు సాధిస్తాయని సర్వే వెల్లడించింది. 2014 కంటే బీజేపీ మాత్రం ముందంజలో ఉండనుంది. 2014లో ఎన్డీయే 17 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు 24 శాతం ఓట్లు సాధిస్తుందని తేలింది.
5:24 PM, 24 May

బీహార్‌లో బీజేపీ - జేడీయులపై వ్యతిరేకత అంతగా లేదని సర్వేలో వెల్లడైంది. 2009తో పోల్చుకుంటే ఓట్ షేర్ 9 శాతం పెరగనుంది.
5:23 PM, 24 May

బీహార్‌లో బీజేపీ - జేడీయు మిత్రపక్షాల పరిస్థితి బాగానే ఉందని సర్వేలో వెల్లడైంది. ఈ రెండు పార్టీలు కలిసి 60 శాతం ఓట్లు సాధిస్తాయని తేలింది. అదే సమయంలో యూపీఏ దాని మిత్రపక్షాలు కేవలం 34 శాతం ఓట్లు సాధిస్తాయని తేలింది. మిగతా పార్టీలు ఆరు శాతంతో సరిపెట్టుకోనున్నాయి.
5:22 PM, 24 May

రాజస్థాన్‌లో బీజేపీ కంటే కాంగ్రెస్ కొంత ముందంజలో ఉంది. 5 శాతం ఓట్లు ఎక్కువ సాధిస్తుందని సర్వేలో తేలింది. అదే సమయంలో మధ్యప్రదేశ్‌లో మాత్రం చాలా తేడా ఉంది. రెండు పార్టీల మధ్య 10 శాతం తేడా ఉంది.
5:20 PM, 24 May

రాజస్థాన్, మధ్యప్రదేశ‌లలో బీజేపీకి వ్యతిరేకత ఉందని సర్వేలో వెల్లడైంది. ఈ రెండు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ తిరిగి గెలుపొందలేదని సర్వేలో వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది.
5:16 PM, 24 May

- ఇప్పుడు కనుక మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే బీజేపీకి 34 శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వేలో తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 49 శాతం ఓట్లు సాధిస్తుంది. ఇతర పార్టీలు 17 శాతం దక్కించుకుంటాయి.
5:15 PM, 24 May

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. శివరాజ్ సింగ్ నేతృత్వంలో సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
2019 is a crucial year and the Narendra Modi government would face the electorate. An interesting mood of the nation survey has been conducted to find out what the people feel about the existing government which completes four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X