వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు ఎదురుదెబ్బ : రేటింగ్ బీఏఏ3కి తగ్గించిన మూడీస్, తొలిసారి నెగెటివ్‌లోకి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశానికి ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ షాకిచ్చింది. భారతదేశం యొక్క సావరిన్ రేటింగ్స్ ను బీఏఏ3కి తగ్గించింది అంతేగాక, ఇండియా ఔట్ లుక్‌ను 'స్టేబుల్' నుంచి (నెగెటివ్'గా మార్చింది. ఈ మేరకు మూడీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా, కొద్ది రోజుల క్రితం ఎస్ అండ్ పీ, ఫిచ్ రేటింగ్స్ కూడా భారత రేటింగ్స్ తగ్గించిన విషయం తెలిసిందే. తాము భారతదేశం స్థానిక కరెన్సీ రేటింగ్ ను బీఏఏ2 నుంచి బీఏఏ 3కి తగ్గించామని మూడీస్ తన తాజా ప్రకటనలో వెల్లడించింది. కాగా, రెండు దశాబ్దాల్లో ఇలా తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 Moodys downgrades Indias rating to Baa3 first time in over 2 decades

స్వల్పకాలిక స్థానిక కరెన్సీ రేటింగ్ కూడా పీ-2 నుంచి పీ-3కి తగ్గించారు. మూడీస్ నిర్ణయం రాబోయే కాలంలో దేశంలోని పాలసీ మేకింగ్ ఇనిస్టిట్యూషన్లకు సవాలుగా మారనుంది. వారు తీసుకున్న చర్యలను సక్రమంగా అమలు చేయడం వారికి చాలా అవసరం. ఇంకా సరైన దిశలో చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని క్రమంగా తగ్గించే అవకాశం ఉంది.

Recommended Video

Viral Video : Funny DRS Video Of Kids Enacting Slow-Motion Replay

కాగా, మూడీస్.. రేటింగ్ తగ్గించడానికి ప్రధాన కారణం కరోనా వ్యాప్తి ద్వారా ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం మాత్రమే కాదని పేర్కొంది. అయితే, కరోనా లాక్‌డౌన్
బారత క్రెడిట్ ప్రొఫైల్‌కు హానికరంగా మార్చిందని వెల్లడించింది. కరోనా వ్యాప్తికి ముందే దేశ ఆర్థిక ఔట్ లుక్‌ను నెగెటివ్ గా మార్చాలని నిర్ణయించకున్నామని పేర్కొంది. దేశంలో కరోనా తర్వాత కూడా చాలా కాలంపాటు మందగించిన వృద్ధిని చూడాల్సి ఉంటుందని మూడీసీ తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు 4శాతానికి తగ్గించినట్లు పేర్కొంది.

English summary
Moody's Investors Service on Monday downgraded India's sovereign credit rating for the first time in more than two decades, saying policymakers will be challenged to mitigate risks of low growth, deteriorating fiscal position and financial sector stress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X