బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపులు..: రాహుల్‌పై కాంగ్రెస్ నేత జయంతి సంచలనం, గుడ్‌బై?

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి జయంతి నటరాజన్ సొంత పార్టీ పైన, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2013లో తనను బలవంతంగా కేంద్రమంత్రి పదవి నుండి తప్పించారని ఆరోపించారు.

వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం తనను వేధించిందన్నారు. రాహుల్ గాంధీ కార్యాలయంలోనే తన పైన కుట్రకు పథకం సిద్ధమైందని ఆమె ఘాటైన ఆరోపణలు చేశారు. తాను రాహుల్ గాంధీని ఎంతో గౌరవించినప్పటికీ తన పైన కుట్ర జరిగిందని ఆరోపించారు.

గత నవంబరులోనే ఈ లేఖ రాశారు..

cracks in Cong; Jayanthi Natarajan makes startling claims in letter to Sonia Gandhi

జయంతి నటరాజన్ గత ఏడాది నవంబర్ నెలలో రాసిన లేఖ ఇప్పుడు లీకు అయింది. ఆమె అప్పుడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాజాగా అది మీడియాకు లీకైంది.

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై?

కాంగ్రెస్ పైన, రాహుల్ గాంధీ పైన జయంతి నటరాజన్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఆ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమె శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు.

English summary
In what could prove to be a major setback for the Congress party, senior leader Jayanthi Natarajan has accused party leaders of victimising her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X