వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళైన మహిళలే ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళి కాని వారు ఉద్యోగాలు ఎందుకు చేయడం లేదంటే

పెళ్ళిచేసుకొన్న మహిళలే పెళ్ళిచేసుకొని వారి కంటే ఉద్యోగాలు ఎక్కువగా చేస్తున్నారని ఓ సర్వే నివేదిక వెల్లడించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెళ్ళికాని యువతుల కంటే వివాహం చేసుకొన్న వారే ఎక్కువగా ఉద్యోగ బాద్యతలను నిర్వహిస్తున్నారు. కటుుంబసభ్యుల బాద్యతలను తీసుకొంటూ ఉద్యోగ బాద్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మహిళలు. వివాహం అయిన 41 :శాతం వివాహితులు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్ళికాని వారు కేవలం 21 శాతం మాత్రమే ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.

ఉన్నత చదువులు చదివిన వారు వివాహం కాని వారు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారని అనుకొంటాం, కాని సర్వే నివేదికను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. వివాహం కాని వారి కంటే వివాహం అయిన మహిళలే ఎక్కువగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.

వివాహం చేసుకొన్న వారే ఉద్యోగాలు చేస్తున్నారని సర్వే నివేదిక తేటతెల్లం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా వివాహితులు ఎక్కువగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా వివాహం కాని యువతులు ఉద్యోగాలు చేసేందుకు మాత్రం ఆసక్తిని చూపడం లేదని ఈ సర్వే నివేదిక తెలిపింది.గ్రామీణ ప్రాంతాలకు చెందిన వివాహం చేసుకొన్న మహిళలు ఇరవై శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే పట్టణ ప్రాంతాలకు చెందిన వివాహం చేసుకొన్న మహిళలు 22 శాతం మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు.

వివాహితులే ఉద్యోగాలు చేస్తున్నారు

వివాహితులే ఉద్యోగాలు చేస్తున్నారు

పెళ్ళికాని వారి కంటే పెళ్ళి చేసుకొన్న మహిళలే అత్యధికంగా ఉద్యోగాలు చేస్తున్నారని ఓ సర్వే నివేదిక వెల్లడించింది. పెళ్ళికాని యువతులు కేవలం 27 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వివాహం చేసుకొన్న మహిళలు సుమారు 41 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు.కుటుంబ బాద్యతలు నిర్వర్తిస్తూనే ఉద్యోగబాద్యతలను నిర్వహిస్తున్నారు. అయితే వివాహం చేసుకొన్న తర్వాత ఉద్యోగ భాద్యతలను నిర్వహించడం కస్టమనే అభిప్రాయం సాదారణంగా ఉంటుంది. అయితే ఈ సర్వే నివేదిక మాత్రం ఈ అభిప్రాయాలను పటాపంచలు చేసింది.

మహిళలకు పుట్టే పిల్లల సగటు తగ్గింది

మహిళలకు పుట్టే పిల్లల సగటు తగ్గింది

దశాబ్దం క్రితం పిల్లలను కనే వయస్సులో ఉన్న ఒక్కో మహిళ సగటున 3.3 మంది పిల్లలను కనేది. అయితే ప్రస్తుతం ఇది 3.3 నుండి 2.9 సగటుకు పడిపోయింది. ఉద్యోగాలు చేసే మహిళలకు మాత్రమే ఈ లెక్కలుగా నివేదిక తేటతెల్లం చేసింది. మరో వైపు ఉద్యోగాలు చేయని వారిలో పిల్లలు పుట్టే సగటు 3.1 గా మారింది.లింగ నిష్పత్తి రెండు వర్గాల్లోనూ తగ్గిపోయిందని లెక్కలు చెబుతున్నాయి.2001 లో ఉద్యోగాలు చేసే మహిళలకు పుట్టే ప్రతి వెయ్యి మంది బాలురకు 912 మంది బాలికలు ఉండేవారు. ప్రస్తుతం అది 901 కి పడిపోయింది.ఉద్యోగాలు చేయని వారిలో 901 నుండి 894 కు పడిపోయింది.ఆడపిల్ల అని తేలిస్తే గర్భంలోనే శిశువును చంపడం వల్లే ఈ రకమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.

తల్లి దండ్రులు ఉద్యోగాలు చేయనివ్వడం లేదు

తల్లి దండ్రులు ఉద్యోగాలు చేయనివ్వడం లేదు

వివాహం చేసుకొన్న మహిళలే అత్యధికంగా ఉద్యోగాలు చేయడం వెనుక ప్రధానంగా కుటంబ కారణాలను చెబుతున్నారు. అయితే వివాహం కాని యువుతులు, మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేయకపోవడానికి తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయడానికి అంగీకరించకపోవడమే కారణంగా చెబుతున్నారు.ఈ కారణంగానే అవివాహిత మహిళలు ఉద్యోగాలు చేసే వారి సంఖ్య 27 శాతానికి మాత్రమే పరిమితమైందని నివేదిక తెలుపుతోంది.

కుటుంబ కారణాలతో వివాహితులు ఉద్యోగాలు చేస్తున్నారు.

కుటుంబ కారణాలతో వివాహితులు ఉద్యోగాలు చేస్తున్నారు.

వివాహం చేసుకొన్న మహిళలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.మారిన పరిస్థితులతో తమ పిల్లలను మంచి చదువులు చదివించేందుకు , తాము సమాజంలో మంచిగా బతకాలనే కోరికతో పాటు పెరిగిన ఖర్చులను తట్టుకొనేందుకు భర్త సంపాదనకు తన సంపాదన తోడైతే ఇబ్బందులు లేకుండా జీవించవచ్చనే కారణంగా పెళ్ళిచేసుకొన్న మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారని ఈ సర్వే నివేదిక వెల్లడించింది.

English summary
married woman are more likely to be working than unmarried women said a survey report.just 27% unmarried women are working compared with 41 % among married women. eexperts say that most unmarred women are young and families dont allow them to go out to work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X