ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే ఎక్కువ పేదరికం - నీతి ఆయోగ్ నివేదిక : ప్రెస్ రివ్యూ

విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే పేదరికం ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ నివేదికలు తెలిపినట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.
''భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి అయోగ్ మొదటిసారిగా రూపొందించిన జాతీయ బహువిధ దారిద్య్ర సూచిక(నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ - ఎన్ఎంపీఐ) ఈ విషయాన్ని పేర్కొంది.
పేదరికంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది.
తెలంగాణలో గతంలోని పది జిల్లాల ఆధారంగా పేదరికాన్ని అంచనా వేయగా, ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
అయితే, ఈ నివేదికను నీతి అయోగ్ 2015-16లో తయారైన 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)' వివరాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించింది.
ఇందుకు ప్రధానంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి నాలుగు రంగాలను ప్రాతిపదికగా చేసుకుని ప్రజల స్థితిగతులను తెలుసుకుంది.
ఇక వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పోషకాహారం, చిన్నపిల్లల, శిశు మరణాలు, తల్లుల ఆరోగ్యం, విద్యారంగంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లిన కాలం, హాజరు శాతం, జీవన ప్రమాణాలకు సంబంధించి వంటనూనెలు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు, గృహ వసతి, ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు వంటి 12 అంశాల ఆధారంగా పేదరికాన్ని నీతి ఆయోగ్ అంచనా వేసింది.
దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 700కు పైగా జిల్లాల్లో ప్రజల స్థితిగతులు, జీవన ప్రమాణాలు, పేదరికపు ఛాయలను ఎత్తి చూపింది.
దీని ప్రకారం.. పేదరిక సూచీలో దేశంలోనే బిహార్ రాష్ట్రం 51.91 శాతంతో మొదటి స్థానంలో ఉంది. పేదరికం అతి తక్కువగా కేరళలో (0.71 శాతం) ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొన్నట్లు'' ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.
- వైఎస్ జగన్: 'విపక్ష నేతలు బూతులు మాట్లాడుతున్నారు.. వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు’
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
ఏపీ ప్రభుత్వం మరో రూ. 2,500 కోట్ల రుణం సేకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని మంగళవారం రూ.2,500 కోట్ల మేర రుణం సమీకరించినట్లు 'ఈనాడు' ఒక వార్తలో తెలిపింది.
''రాబోయే 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తిరిగి చెల్లించేలా 7.22 శాతం వడ్డీ ధరతో రూ.1,000 కోట్లు తీసుకుంది. మరో వెయ్యి కోట్లు 18 ఏళ్ల కాలపరిమితికి 7.18 శాతం వడ్డీకి స్వీకరించింది. మరో రూ.500 కోట్లు 16 ఏళ్ల కాలపరిమితితో 7.24శాతం వడ్డీ చెల్లించేలా తీసుకుంది. గడిచిన 8 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద రూ.4,500 కోట్ల మేర రుణం తీసుకున్నట్లయింది.
బహిరంగ మార్కెట్ రుణం కోసం చివరి మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన రుణాల విషయంలో రాష్ట్ర ఆర్థిక అధికారులకు, కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని తెలిసింది.
ఈ నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రుణ మొత్తం పరిమితి ఖరారు కాలేదని సమాచారం. ఈ లోపు ప్రస్తుతం రూ.2,500 కోట్లు ఈ మంగళవారం సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే చివరి త్రైమాసికం రుణ పరిమితి ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని'' ఈనాడు కథనం తెలిపింది.
- తెలంగాణ: కేటీఆర్ సీఎం అయ్యేది ఎప్పుడు ? ప్రెస్ రివ్యూ
- హిమాన్షు బాడీషేమింగ్.. 'అమిత్ షా గురించి, మోదీ కుటుంబం గురించి ఇలాగే మాట్లాడొచ్చా?’ - కేటీఆర్ ఆగ్రహం
బ్రెయిలీ లిపిలో మున్సిపల్ చట్టం
కంటి చూపులేని వారి కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం బ్రెయిలీ లిపిలో ముద్రించిన మున్సిపల్ చట్టాన్ని, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించినట్లు 'నమస్తే తెలంగాణ' కథనంలో పేర్కొంది.
''ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి చూపులేని వారికి కూడా మున్సిపల్ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో భాగంగానే బ్రెయిలీ లిపిలో మున్సిపల్ చట్టాన్ని ముద్రించినట్లుగా చెప్పారు.
మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణతో కలిసి బ్రెయిలీ లిపిలో ముద్రించిన మున్సిపల్ చట్టం 2019 పుస్తకాన్నిరాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ఆవిష్కరించారు.
రాష్ట్రంలో రోజూవారీ వ్యవహారాల్లో అనేక మందికి మున్సిపల్ చట్టం అవసరం ఉంటుందని, బ్రెయిలీలో ముద్రించిన పుస్తకం కంటిచూపులేని చాలా మందికి ఉపయోగపడుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ సీడీఏంఎ ఎన్.సత్యనారాయణ, ఇతర అధికారులను కేటీఆర్ అభినందించారు.
దివ్యాంగులు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. వారికి ఆసరా పింఛన్, కింద నెలకు రూ.3016 ఇస్తుందన్నారు. దీనితో పాటుగా మూడు చక్రాల వాహనాలు, ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు.
దివ్యాంగుల కోసం మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. ఇప్పటికే మున్సిపల్ చట్టం తెలుగు, ఇంగ్లిష్‌లో ముద్రించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దివాకర్ రావు, మాగంటి గోపినాథ్ పాల్గొన్నట్లు'' నమస్తే తెలంగాణ పేర్కొంది.
- తాగునీరు అందని గ్రామాలు.. ఆంధ్రాలో మూడోవంతు, తెలంగాణలో సగం
- కనీస మద్ధతు ధరను చట్టబద్ధం చేస్తే ఏమవుతుంది, మోదీ ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు?

కోడి పందేలను అడ్డుకోండి: హైకోర్టులో పిటిషన్
సంక్రాంతి సందర్భంగా కోడి పందేల నిర్వహణను అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని 'సాక్షి' ఒక వార్తను ప్రచురించింది.
''పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి, తోగుమ్మి, మద్దూర తదితర గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలతో పాటు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తోగుమ్మి, వాడపల్లి గ్రామాలకు చెందిన పి. సుభాష్ చంద్రబోస్, బి. వెంకట దుర్గా ప్రసాద్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్ ఆర్డీవో, పోలీసు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.
కొందరు రాజకీయ నాయకులు, సంఘ వ్యతిరేక శక్తులు ఏటా కోడి పందేలు, జూదం, అక్రమ మద్యం అమ్మకాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాని పిటిషనర్లు తెలిపారు.
రాష్ట్రంలో కోడి పందేలు జరగకుండా చూడాలని హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
అయినా పందేలు జరుగుతూనే ఉన్నాయని, దీనపై జోక్యం చేసుకొని తగిన ఆదేశాలు జారీచేయాలని పిటిషనర్లు కోరినట్లు'' సాక్షి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- బుల్లీ బాయి, సుల్లీ డీల్స్: యాప్‌లో ముస్లిం మహిళల వేలం ప్రధాన సూత్రధారి 18 ఏళ్ల యువతి
- చైనా ప్రజల కష్టాలు: బియ్యం కోసం గాడ్జెట్లు, క్యాబేజీ కోసం సిగరెట్లు మార్పిడి
- ఆన్లైన్ ప్రేమతో ఎడారి పాలైన పాకిస్తాన్ యువకుడు.. ప్రేయసిని కలిసేందుకు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబాటు
- ఆధునిక చీర కట్టు ఏ రాష్ట్రానికి చెందినది?
- కర్మ అంటే ఏంటి? మనిషికి పునర్జన్మ నిజంగా ఉంటుందా? హిందూ మతం, బౌద్ధ మతం ఏం చెబుతున్నాయి?
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- దళిత యువకుడు గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా... మూడునెలలుగా ఎందుకు తేలడం లేదు?
- వాట్సాప్ మెసేజ్‌లో లింక్ క్లిక్ చేయమన్నారు... రెండున్నర లక్షలు కొల్లగొట్టారు - ప్రెస్‌రివ్యూ
- కొత్త ఏడాదిలో కాస్త హేతుబద్ధంగా ఉందామా... ఇవిగో మూడు మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)