వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్‌లాక్ 5.0: సినిమా హాళ్లు, టూరిస్ట్ స్పాట్లకు పర్మిషన్..? 1వ తేదీ నుంచి అమలు

|
Google Oneindia TeluguNews

అన్ లాక్ 4.0 ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అన్ లాక్ 5.0లోకి ప్రవేశించబోతున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత 7 నెలల నుంచి మూసివేసిన సినిమా థియేటర్లు, పర్యాటక ప్రాంతాలకు అనుమతించబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి కేంద్ర నిర్ణయం తీసుకుందని.. ప్రకటించడమే తరువాయి అని సమాచారం.

అన్ లాక్ 5.0..

అన్ లాక్ 5.0..

గతంతో పోలిస్తే అన్ లాన్ 5.0లో మరిన్ని సడలింపులు ఉండనున్నాయి. ఇటీవల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సందర్భంలో దీనిపై ప్రస్తావించారు. ఇదివరకు ఉన్న కంటైన్మెంట్ జోన్ల స్థానంలో మైక్రో-కంటెయిన్ మెంట్ జోన్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సమావేశంలో వచ్చిన సంగతి తెలిసిందే. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్వల్ప కాలం లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాలని సీఎంలకు సూచించారు.

పండగల సీజన్..

పండగల సీజన్..


మరోవైపు దేశంలో దసరా, దీపావళి పండగ సీజన్ ఆరంభమవబోతోంది. తర్వాత క్రిస్మస్ కూడా ఉండనుంది. ఈ క్రమంలో మరిన్ని నిబంధనలను సడలించాలని భావిస్తోంది. ప్రజల యాక్టివిటీ పెంచడంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు సినిమా హాల్స్ తిరిగి తెరచుకోవచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బార్లు, క్లబ్బులు తెరచుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి సినిమా హాల్స్ తెరచుకోవచ్చని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

 50 శాతం కన్నా తక్కువ..

50 శాతం కన్నా తక్కువ..

సినిమా హళ్లలో లైన్ వదిలి లైన్‌లో సీట్లను ఖాళీగా ఉంచాలని స్పష్టంచేసింది. 50 శాతం కన్నా తక్కువ ప్రేక్షకులతో సినిమాలను ప్రదర్శించుకునేందుకు అన్ లాక్ 5.0లో అనుమతి లభించనుంది. దీనికి సంబంధించి కేంద్ర హోమ్ శాఖకు సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖారే లేఖ కూడా రాశారు. మరోవైపు పర్యాటక శాఖకు సడలింపులు లభించే అవకాశం ఉంది. పర్యాటకులకు స్వాగతం పలికేలా అన్ని టూరిజం స్పాట్లు తెరచుకునే ఛాన్స్ ఉంది.

Recommended Video

Unlock 1.0 : Malls Remain Deserted After Reopening
టూరిస్టులకు ఆహ్వానం..

టూరిస్టులకు ఆహ్వానం..

ఉత్తరాఖండ్ టూరిస్టులను స్వాగతిస్తోంది. కరోనా రిపోర్టు, క్వారంటైన్ లేకుండానే రాష్ట్రానికి పర్యాటకులు వచ్చి పోవచ్చని స్పష్టంచేసింది. అక్టోబర్ నుంచి విద్యా సంస్థలకు కూడా మరిన్ని సడలింపులు ఉండనున్నాయి. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేస్తుందని విశ్వసనీయంగా తెలిసింది. పలు రాష్ట్రాల్లో 9 నుంచి 12 తరగతులకు క్లాసులు నడుస్తున్నాయి.

English summary
unlock 5.0: more relaxations unlock 5.0. cinema hall, tourists spots are may be opened
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X