వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2050 సార్లు కాల్పులు జరిపిన పాకిస్తాన్, 21 మంది భారతీయుల మృతి..

|
Google Oneindia TeluguNews

సంవత్సర కాలంగా పాకిస్థాన్ 2050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని, ఆ కాల్పుల్లో మొత్తం 21 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నియంత్రయణ రేఖ వెంట అప్రజాస్వామికంగా కాల్పుల ఉల్లంఘనలు చేసిన వివరాలను పాకిస్తాన్‌కు సైతం తెలిపినట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ ఆదివారం తెలిపారు.

సంవత్సరంలో 2050 సార్లు కాల్పులు

సంవత్సరంలో 2050 సార్లు కాల్పులు

ఇండియా,పాకిస్థాన్‌ దేశాల మధ్య నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 2003లో ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య జరిగినా.. పాకిస్థాన్ మాత్రం ఈ ఒప్పందాన్ని పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే..ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరీ 14న పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ తన పలుసార్లు కాల్పుల విరమణకు పాల్పడిందని రావిష్ కుమార్ తెలిపారు. ఇలా సంవత్సర కాలంలో 2050 సార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఆయన తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరింత పెరిగిన ఉద్రిక్తత

ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరింత పెరిగిన ఉద్రిక్తత

మరోవైపు ఆర్టికల్ 370 తర్వాత పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎక్కువ సార్లు ఉల్లంఘించందని చెప్పారు. ఆర్టికల్ రద్దుతో ఇరు దేశాలమధ్య ఉద్రిక్త వాతవరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటుకు సహకరిస్తూ,కాల్పులకు దిగుతున్న అంశాన్ని తాము హైలైట్ చేశామని ఆయన ప్రకటించారు.అయితే పాకిస్థాన్ ఇన్ని సార్లు కాల్పులు జరిపిన నేపథ్యంలోనే మొత్తం 21 మంది భారతీయ సైనికులు మృత్యువాత పడ్డట్టు కూడ ఆయన ప్రకటించారు.

ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించేందుకు పాక్ ప్రయత్నం

ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించేందుకు పాక్ ప్రయత్నం

కాగా కశ్మీర్ అంశాన్ని అంతార్జాతీయం చేసేందుకు పాకిస్థాన్ పలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే, ఇందుకు సంబంధించి ఆ దేశం వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో కశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులను చొరబాటు చేయింది. కశ్మీర్‌తో పాటు భారత భూభాగంలో అల్లర్లు సృష్టించాలనే కుట్రకు పాకిస్తాన్ తెరలేపింది. అయితే భారతీయ సైన్యాలు అప్రమత్తంగా ఉండి పాకిస్తాన్ సైన్యాన్ని, ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కోంది. ఈ నేపథ్యంలోనే ఇటివల ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ సైనికులు చనిపోవడంతో తెల్లజెండాలతో వచ్చి వారిని తీసుకుపోయిన విషయం తెలిసిందే. ఇక ఇరు దేశాల కాల్పుల్లో పాకిస్తాన్ ‌కు చెందిన పలువురు సైనికులు కూడ మృత్యువాత పడ్డారు.

English summary
There had been more than 2,050 unprovoked ceasefire violations this year, in which 21 Indians had been killed, external affairs ministry spokesperson Raveesh Kumar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X