వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 ఏళ్లలో 3000కు పైగా ఎనౌకంటర్లు... 7000 మంది క్రిమినల్స్ అరెస్ట్... ఎక్కడో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

ఉత్తర ప్రదేశ్ అంటే ఒకప్పుడు నేరాలు,ఘోరాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది ..కాని రెండు సంవత్సరాల్లోనే పరిస్థితి మారింది. ముఖ్యంగా బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి అధిత్యనాథ్ వచ్చిన అనంతరం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత యూపీలో క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు నేర చరితుల విషయంలో రాజకీయాలకు తావు లేకుండా చేశాడు. దీంతో రెండు సంవత్సరాల్లోనే 3000కు పైగా ఎన్‌కౌంటర్లు జరిగాయి.

 రెండు సంవత్సరాల్లో 3వేలకు పైగా ఎన్‌కౌంటర్లు,

రెండు సంవత్సరాల్లో 3వేలకు పైగా ఎన్‌కౌంటర్లు,

ఈనేపథ్యంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో 3000వేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఎన్‌కౌంటర్లలో 69 మంది క్రిమినల్స్ మ‌ృతి చెందగా మరో 838 మంది క్రిమినల్స్ గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌లో భాగంగానే సుమారు 7000 మంది క్రిమినల్స్ అరెస్ట్ చేశారు. మరో వైపు నేర చరిత్ర కల్గి వివిధ కేసుల్లో బెయిల్‌పై ఉన్న 12000 వేల మంది బెయిల్స్‌ను రద్దుచేశారు. ఇక ఎన్‌కౌంటర్ సంధర్భంలోనే ప్రత్యేక దళాలకు చెందిన అర డజను మంది పోలీసులు కూడ మృత్యువాత పడ్డారు. కాగా ఎక్కువగా మీరట్, ముజఫర్‌నగర్‌తోపాటు ఘజియాబాద్, నోయిడా, బులంద్‌షెహర్, జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్లు జరిగినట్టు తెలుస్తోంది.

పోలీసులకు ఫ్రీ హ్యాండ్

పోలీసులకు ఫ్రీ హ్యాండ్

కాగా పోలీసు అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే నేరాలు చేసే క్రిమినల్స్ లేకుండా చేయగల్గుతున్నారని పలువరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎంగా ప్రమాణాస్వీకారం చేసిన తర్వాత పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తానని ప్రకటించడంతోపాటు వెంటనే దాన్ని అమలు చేశాడు. దీంతోపాటు క్రిమినల్స్ విషయంలో రాజకీయ ప్రమేయం లేకుండా చేశాడు. దీంతో క్రిమినల్స్ విషయంలో పార్టీలకు అవకాశం లేకుండా చేయడంతో ఏ పార్టీకి చెందిన క్రిమినల్స్‌నైనా పట్టుకుని శిక్షించే అధికారం పోలీసులకు చిక్కింది. దీంతో ఇంత పెద్ద ఎత్తున ఎన్‌కౌంటర్లు జరిగేందుకు అవకాశం లభించింది.

ఎన్‌కౌంటర్లపై సుప్రింలో పిటిషన్

ఎన్‌కౌంటర్లపై సుప్రింలో పిటిషన్

అయితే ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూ,వీటిపై సీబీఐ లేదా సిట్‌ను ఏర్పాటు చేయాలని పీయూసీఎల్ సుప్రిం కోర్టులో పిల్‌ను దాఖలు చేసింది. దీంతోపాటు హ్యాూమన్ రైట్స్ కమీషన్ కూడ సుమోటగా కేసు నమోదు చేసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినా... సీఎం యోగి మాత్రం నేర చరితులపై కఠిన వైఖరి అవలంబించాడు. నేరగాళ్లు అరెస్ట్ చేయడం లేదంటే ఎన్‌కౌంటర్ చేయడం అనే ప్రకటన చేసి, నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.

 ఎన్‌కౌంటర్లన్ని హత్య కేసులుగా నమోదు చేయాలని సుప్రిం కోర్టు ఆదేశం...

ఎన్‌కౌంటర్లన్ని హత్య కేసులుగా నమోదు చేయాలని సుప్రిం కోర్టు ఆదేశం...

అయితే సుప్రిం కోర్టు ఇటివల ఎన్‌కౌంటర్లపై ఓ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే ఎనౌకంటర్లపై అన్నింటిపై హత్య కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

English summary
Ever since the Yogi Adityanath-led Bharatiya Janata Party (BJP) government came to power in Uttar Pradesh in March 2017, the one thing it has been constantly in news for is the increasing cases of encounter killings that have taken place in the region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X