బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: 40 వేల రహస్య ఫోన్ నెంబర్లు బయటపెట్టిన బెంగళూరు పోలీసులు !

ఫిర్యాదు చేసిన ప్రజల ఫోన్ నెంబర్లు రహస్యంగా పెట్టాల్సిన బెంగళూరు పోలీసులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40,000 మంది ప్రజల రహస్య ఫోన్ నెంబర్లు ట్వీట్టర్ పోస్టు చెయ్యడంతో బాధితులు షాక్ అయ్యారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సోషల్ మీడియాలో ప్రజల సమస్యలు పరిష్కారానికి వెంటనే స్పందిస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారని ఇంత కాలం మంచి పేరు తెచ్చుకున్న బెంగళూరు సిటీ పోలీసులు భారీ మూల్యం చెల్లించుకున్నారు.

ఫిర్యాదు చేసిన ప్రజల ఫోన్ నెంబర్లు బహిర్గతం చేసి విమర్శలపాలైనారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40,000 మంది ప్రజల రహస్య ఫోన్ నెంబర్లు ట్వీట్టర్ పోస్టు చెయ్యడంతో బాధితులు షాక్ అయ్యారు. అదికూడా పోలీసు శాఖకు చెందిన ట్వీట్టర్ లోనే ప్రజల ఫోన్ నెంబర్లు బహిరంగంగా పోస్టు చేశారు.

More than 40,000 phone numbers were made public by the Bengaluru City Police Control Room's twitter handle.

బెంగళూరు నగరంలోని వివిద పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన వారి ఫోన్ నెంబర్లు, పోలీసు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేసిన ప్రజల ఫోన్ నెంబర్లు పోలీసు శాఖకు చెందిన ట్వీట్టర్ లోనే లీక్ కావడంతో ఆ ఫోన్ నెంబర్లు అందరికీ తెలిసిపోయాయి.

విషయం తెలుసుకున్న పోలీసు శాఖ వెంటనే బెంగళూరు సిటీ పోలీసు కంట్రోల్ రూం ట్వీట్టర్ అకౌంట్ ను క్లోజ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో ప్రజలకు తెలిసిపోవడంతో వారు కొంత ఆందోళనకు గురైనారు. తమ ఫోన్ నెంబర్లు అందరికీ తెలిసిపోవడంతో ఇప్పుడు కొత్త సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ఫిర్యాదు చేసిన ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు.

English summary
The Bengaluru police ended up breaching the privacy of citizens who reached out to them on their emergency contact number, 100. More than 40,000 phone numbers were made public by the Bengaluru City Police Control Room's twitter handle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X