వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడి తర్వాత పాక్ సమీపంలో 70కి పైగా వార్‌షిప్స్: ఐఎన్ఎస్, న్యూక్లియర్ సబ్‌మెరైన్లు సహా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి అనంతరం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎఫ్ 16 విమానాలతో మన సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. కానీ మిగ్ 21 జెట్ విమానాలతో భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే.

2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్‌కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్‌కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్

ట్రోఫెక్స్ ఎక్సర్‌సైజ్‌లో ఇండియా

ట్రోఫెక్స్ ఎక్సర్‌సైజ్‌లో ఇండియా

పుల్వామా దాడి తదనంతర పరిణామాలపై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం.. పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ సమీపంలో భారత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, న్యూక్లియర్ సబ్‌మెరైన్లు, బాటిల్ షిప్స్‌ను మోహరించింది. అదే సమయంలో ఇండియన్ నేవీ ట్రోపెక్స్ 2019‌లో పాల్గొంటోంది. ట్రోఫెక్స్ అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, కోస్ట్ కార్డ్... ఇంటర్ సర్వీస్ మిలిటరీ ఎక్సర్‌సైజ్. పుల్వామా దాడి సమయంలో ట్రోఫెక్స్ జరుగుతున్నందున ఇండియన్ నేవీకి చెందిన పలు షిప్‌లు అరేబియన్ సముద్రంలో ఉన్నాయి. అప్పుడే పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రైక్స్ జరిగింది.

ఉత్తర అరేబియా సముద్రంలో ఎక్సర్‌సైజ్

ఉత్తర అరేబియా సముద్రంలో ఎక్సర్‌సైజ్

పుల్వామా దాడికి ముందే ట్రోఫెక్స్ 2019 ఎక్సర్‌సైజ్ ప్రారంభమైంది. ఆ తర్వాత పుల్వామా ఉగ్రవాద దాడి తెలియగానే దీనిని ఆపేశారు. షిప్స్‌ను అరేబియా సముద్రం వద్ద ఉంచారు. ఇందులో ఐఎన్ఐస్ విక్రమాదిత్య, న్యూక్లియర్ సబ్‌మెరైన్లు, ఇతర యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లను ఆపరేషన్ కోసం సిద్ధంగా ఉంచారు. ఉత్తర అరేబియా సముద్రంలో వీటిని ఉంచారు. ఇది పాకిస్తాన్ సముద్ర తీరానికి సమీపంలో ఉంటుంది.

 70కి పైగా షిప్స్

70కి పైగా షిప్స్

ఇండియన్ నేవీకి చెందిన 60కి పైగా షిప్స్, 12 ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్, 60 ఎయిర్ క్రాఫ్ట్స్‌లు ట్రోపెక్స్ 2019లో పాల్గొన్నాయి. పుల్వామా దాడి తెలియగానే ట్రోఫెక్స్‌ను ఆపేసి, ఆపరేషన్ కోసం సిద్ధం చేశారు. కాగా, ట్రోఫెక్స్ 19 జనవరి 7వ తేదీన అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రారంభమైంది. దీనిని 13 తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగించారు. ఫిబ్రవరి 26వ తేదీన ట్రోఫెక్స్ 19ను ఆపేశారు. అదే రోజు సర్జికల్ స్ట్రైక్స్ జరిగింది. అంతకుముందు ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన విషయం తెలిసిందే.

English summary
More than 70 vessels including INS Vikramaditya, nuclear submarines, battleships were deployed near Pakistan after Pulwama Attack, says Indian Navy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X