వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విజృంభిస్తున్నా.. మరో గుడ్‌న్యూస్ కూడా ఉంది..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ సానుకూల విషయం కూడా ఒకటి మనకు కనిపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులతోపాటు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.తాజాగా, ఆదివారం కరోనావైరస్ రికవరీ రేటు 50 శాతం దాటిందని కేంద్రం వెల్లడించింది.

 తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి.. తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి..

రికవరీ రేటు 50శాతం మించి..

రికవరీ రేటు 50శాతం మించి..

గత 24 గంటల్లో అత్యధికంగా 11,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 50.60శాతం మంది

కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో వైరస్ సోకిన వారిలో సగం కంటే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. గత రెండు రోజులుగా రోజుకు 11వేల చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ రికవరీ రేటు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరగడం శుభపరిణామమే అని చెప్పవచ్చు.

కోలుకుంటున్నారు..

కోలుకుంటున్నారు..

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,49,348 యాక్టివ్ కేసులుండగా, 1,62,378 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక 9,195 మంది కరోనావైరస్ బారినపడి మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం హోంమంత్రి అమిత్ షా కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను బలోపేతం చేస్తామని తెలిపారు.

Recommended Video

China Reports New COVID-19 Cases Again!
మూడున్నర లక్షల దిశగా కేసులు

మూడున్నర లక్షల దిశగా కేసులు

ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో పెంచుతామన్నారు. అదేవిధంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, ఆస్పత్రుల్లో బెడ్ల కొరతను నివారించడానికి 500 రైల్వే కోచ్‌లను కరోనా బాధితులకు కేటాయిస్తామన్నారు. ఢిల్లీలో పరీక్షలను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. కాగా, ప్రస్తుతం 3,24,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ 1,50,581 యాక్టివ్ కేసులుండగా, 1,65,274 మంది కోలుకున్నారు. 9283 మంది కరోనా బారిన పడి మరణించారు.

English summary
India's COVID-19 recovery rate crossed 50 per cent today even as the country logged the biggest single-day jump of 11,929 new infections in the last 24 hours, the government data said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X