వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్ -ఐసోలేషన్‌లో అశ్వినీ కుమార్ చౌబే

|
Google Oneindia TeluguNews

కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశంలో కరోనా విలయం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు వైరస్ కాటుకు గురికాగా, అందులో ఓ కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తాజాగా సాక్ష్యాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే కూడా మహమ్మారి బారినపడ్డారు.

year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. స్పల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని, దాంట్లో తనకు వైరస్ సోకినట్లు తేలిందని మంత్రి స్వయంగా సోమవారం ప్రకటించారు.

 MoS Health Ashwini Kumar Choubey tests COVID-19 positive, is in home isolation

డాక్టర్ల సలహాలు, కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి చౌబే తెలిపారు. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకుని ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా ఆయన సూచించారు. కాగా,

షాకింగ్: పతనం దిశగా బీహార్ సర్కార్ -సీఎం పదవి వద్దన్న నితీశ్ -బీజేపీ గూటికి జేడీయూ ఎమ్మెల్యేలు -కలకలంషాకింగ్: పతనం దిశగా బీహార్ సర్కార్ -సీఎం పదవి వద్దన్న నితీశ్ -బీజేపీ గూటికి జేడీయూ ఎమ్మెల్యేలు -కలకలం

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ముమ్మరం చేసిన సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి వైరస్ బారినపడటం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న ఒక్కరోజే దేశంలో కొత్తగా 20,021 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871కి చేరింది. ఇందులో 97,82,669 మంది ఇప్పటికే కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆదివారం నాటి 279 మరణాలతో కలిపి మహమ్మారికి బలైపోయినవారి సంఖ్య 1,47,901కి పెరిగింది.

English summary
Union minister of state for Health and Family Welfare Ashwini Kumar Choubey said he has tested positive for the novel coronavirus infection. He announced the news on Twitter, saying " On noticing the initial symptoms of corona, I got myself tested today and the report has come positive." The minister added that his health was fine and he was in home isolation on the advice of doctors and following all protocols. Choubey appealed to all those who came into contact with him over the past few days to self-isolate and get themselves tested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X